
హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్గా గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్ మోటర్ఇండియా కొత్త ఎస్‌యూవీ ఎక్స్ టర్ ను జులై 10న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటర్ క్రేజ్ ను పెంచడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ఎక్స్‌టర్ ఎస్‌యూవీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. హార్దిక్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తో ఎక్స్ టర్ సేల్స్ ను పెంచుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్ టర్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలంటే అది హార్ధిక్ పాండ్యాతోనే సాధ్యమవుతుందని, ఈ తరం క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్ గా పాండ్యాకు మంచి గుర్తింపు ఉందని హ్యుందాయ్ మోటర్ ఇండియా సీఓఓ తరుణ్ గర్గ్ పేర్కొన్నారు.
Details
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్స్‌పై లాంచ్ సమయంలో క్లారిటీ
కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ లాంచ్ డేట్ దగ్గరపడుతుండటంతో వెహికల్ కు సంబంధించిన టీజర్ లను ఒక్కొక్కటిగా హ్యుందాయ్ సంస్థ విడుదల చేస్తోంది. అందులో ఉన్న కొన్ని ఫీచర్లపై క్లారిటీ వచ్చింది.
ఇందులో డ్యూయెల్ కెమెరాలున్న ఉన్న డాష్ కామ్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సనరూఫ్ వంటివి ఇందులో రానున్నాయి. హ్యుందాయ్ ఎక్స్ టర్ లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది.
ఈ ఇంజిన్ 82 బీహెచ్పీ పవర్ను, 114 ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధరపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
లాంచ్ సమయంలో అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.