Page Loader
సరికొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. 2024లో భారత్ లాంచ్ అయ్యే అవకాశం!
సరికొత్తగా వస్తున్న స్కోడా కొడియాక్

సరికొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. 2024లో భారత్ లాంచ్ అయ్యే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా కంపెనీ మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. స్కోడా కొడియాక్ పేరుతో ఈ సెవన్ సీటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇంతకుముందే 2017లో SUV మోడల్ విడుదల చేసినప్పటికీ పెద్ద విక్రయాలు జరగలేదు. అయితే ఇటీవల విడుదల చేసిన ఈ కారుకి మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫోటోలు కస్టమర్లను విపరీతంగా అకట్టుకుంటున్నాయి. స్కోడా కొడియాక్ స్టైల్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.37.99 లక్షలతో ప్రారంభమై.. వేరియంట్లను బట్టి రేట్లు మారే అవకాశం ఉంది. ఈ మోడల్ ను ఇండియాలో 2024లో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు అనుగుణంగా ఆటోమేకర్ క్వాసినీ ప్లాంట్‌లో 2024 స్కోడా కొడియాక్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.

Details

స్కోడా కొడియాక్ కోసం రూ.13 మిలియన్ల పెట్టుబడులు

ఆటో బోర్డు మెంబర్ మైఖేల్ ఓల్జెక్లాస్ మాట్లాడుతూ రాబోయే రెండోతరం కోసం కిడియాక్ ఉత్పత్తికి ఇప్పటికే సన్నహాలను పూర్తి చేశామని, మరెన్నో సాంకేతికలను జోడించి సరికొత్త ఫీచర్లతో సమగ్రంగా ఈ మోడల్ ను అందుబాటులోకి తేస్తామన్నారు. కొత్త కోడియాక్, దాని ఎలక్ట్రిఫైడ్ పవర్‌ట్రెయిన్ కోసం ఇప్పటికే రూ. 13 మిలియన్లు పెట్టుబడి పెట్టినట్లు స్కోడా స్పష్టం చేసింది. ప్రతిరోజూ 410 యూనిట్ల కొడియాక్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. 2024 స్కోడా కొడియాక్ ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. భారతదేశంలో కోడియాక్‌కు బలమైన డిమాండ్ ఉండటంతో 2024లో భారత్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్కోడా వచ్చే మొదటి త్రైమాసికంలో ఎన్యాక్ iV ఎలక్ట్రిక్ SUVని తీసుకురానుంది.