Magma GT: ఫెరారీ-మెక్‌లారెన్‌లకు ఝలక్ ఇవ్వబోతున్న జనేసిస్ 'మాగ్మా GT' కాన్సెప్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్ సబ్ బ్రాండ్ జనేసిస్ కొత్తగా ఆవిష్కరించిన మాగ్మా GT కాన్సెప్ట్‌తో ఫెరారీ, మెక్‌లారెన్‌లకు ఝలక్ ఇచ్చే సూపర్‌కార్‌ను 2027 తర్వాత మార్కెట్లోకి తీసుకురానుందని స్పష్టం చేసింది. మిడ్-ఇంజిన్ సెటప్‌తో రూపొందించిన ఈ మోడల్ జనేసిస్ పెర్ఫార్మెన్స్ ఫిలాసఫీకి అత్యంత క్లియర్ ఎక్స్‌ప్రెషన్‌గా కంపెనీ చెబుతోంది. కొత్తగా లాంచ్ చేసిన GV60 మాగ్మా సందర్భంగా ఈ కాన్సెప్ట్ కారును బయట పెట్టడం,రాబోయే ఏళ్లలో జనేసిస్ నుంచి వచ్చే లగ్జరీ-హై పెర్ఫార్మెన్స్ వాహనాల లైనప్‌కు ఇది స్టార్ట్ అని బ్రాండ్ వెల్లడించింది. కంపెనీ క్రియేటివ్ చీఫ్ లూక్ డాంకర్‌వోల్కే చెప్పినట్టుగా, మాగ్మా GT కాన్సెప్ట్ ఏదైనా ప్రస్తుత కార్లకు వేగం జోడించిన వెర్షన్ కాదు, జనేసిస్ ఇప్పటివరకు చేసిన పెర్ఫార్మెన్స్ పనికి సంపూర్ణ ప్రతిరూపం.
వివరాలు
జెనెసిస్ మోటార్‌స్పోర్ట్ ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలు
బ్రాండ్ మోటార్‌స్పోర్ట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైందని, లే మాన్స్ హైపర్‌కార్‌తో రంగంలోకి దిగుతున్నదని ఆయన తెలిపారు. 2027లో IMSA ఛాంపియన్‌షిప్‌లో LMDh కారుతో పోటీ పడాలని, తరువాత GT3 ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించాలని జనేసిస్ ప్లాన్ చేస్తోంది. GT3లో పాల్గొనాలంటే పెట్రోల్ ఇంజిన్‌తో రోడ్-గోయింగ్ స్పోర్ట్స్‌కార్‌ని తయారు చేయాల్సి వస్తుంది, దానికి ప్రివ్యూగానే ఈ మాగ్మా GT కాన్సెప్ట్‌ను చూపించారు. రెండు సీట్లు కలిగిన ఈ సూపర్‌కార్ మెక్‌లారెన్-ఫెరారీ లాంటి బ్రాండ్‌లను లక్ష్యంగా పెట్టుకుని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది.
వివరాలు
మాగ్మా జిటి కాన్సెప్ట్: లగ్జరీ, మోటార్‌స్పోర్ట్ పాత్రల మిశ్రమం
లో ఫ్రంట్ హుడ్, స్లోపింగ్ రూఫ్‌లైన్, వైడ్ రియర్ ఫెండర్లు, ముందూ-వెనుకా ట్విన్-లైన్ లైట్స్, రియర్‌లో లైట్ బార్స్ మధ్య ఇల్యూమినేటెడ్ జనేసిస్ బ్రాండింగ్—అన్నీ ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దారు. అలాగే ఏరోడైనమిక్స్‌ను ఆప్టిమైజ్ చేస్తూ బోట్-టైల్ కేబిన్, బటర్‌ఫ్లై డోర్స్‌ను కూడా అందించారు. ఈ కారు లగ్జరీ-మోటార్‌స్పోర్ట్ వ్యక్తిత్వాల మిశ్రణగా నిలుస్తుందని డాంకర్‌వోల్కే చెబుతున్నారు. జనేసిస్ బ్రాండ్ రాబోయే హై-పెర్ఫార్మెన్స్ దిశలో ఎటువైపు వెళ్తుందో ఈ మాగ్మా GT కాన్సెప్ట్ స్పష్టమైన సంకేతమని కంపెనీ భావిస్తోంది.