మహీంద్రా BE.05 ఫీచర్లు సూపర్బ్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా నుంచి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్ ఈవెంట్ లో మహీంద్రా తమ ఈవీలను పరిచయం చేసింది. అదే విధంగా ఈవీల కోసం కొత్త లోగోను కూడా తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త లోగో BE.05 వాహనంలో కనిపిస్తుందని స్పష్టం చేసింది. ఈ వాహనంలో అక్టోబర్ 2025లో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు మహీంద్రా సంస్థ ప్రధాన డిజైనర్ ప్రతాప్ బోస్ BE.05 వాహన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహీంద్రా BE.05 చూడటానికి చాలా స్టైలిష్‌గా, ఎంతో అకర్షణీయంగా రూపొందించారు.
మహీంద్రా BE.05 అధునాతన ఫీచర్లు
సొగసైన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, C-ఆకారపు LED టెయిల్‌లైట్లు, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఈ వెహికల్ 60kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చినట్లు సమాచారం. EV కేవలం 30 నిమిషాల్లో 5-80% నుండి ఛార్జ్ అవుతుంది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో నిన్న జరిగిన ప్రదర్శనలో కొత్త INGLO ప్లాట్‌ఫారమ్‌లో VW సెల్‌లకు బదులుగా BYD ప్రిస్మాటిక్ (60 kWh), బ్లేడ్ సెల్‌లు (80 kWh) ఉంటాయని మహీంద్రా వెల్లడించింది. BE.05 ధర రూ. 25 నుండి 30 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది.