Loading...
Mahindra BE6 Sporteq: మహీంద్రా BE6 Sporteq లాంచ్.. ప్రారంభ ధర రూ.11.45 లక్షలు
మహీంద్రా BE6 Sporteq లాంచ్.. ప్రారంభ ధర రూ.11.45 లక్షలు

Mahindra BE6 Sporteq: మహీంద్రా BE6 Sporteq లాంచ్.. ప్రారంభ ధర రూ.11.45 లక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మహీంద్రా మరో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా BE6 Sporteqను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, BaaSతో)గా ఉంది. BaaS సదుపాయం లేకుండా కొనుగోలు చేసే వారికి ప్రారంభ ధర రూ.19.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. మహీంద్రా ఇటీవల Scorpio Lifestylerను పరిచయం చేసిన అనంతరం BE6 Sporteqను మార్కెట్లోకి తీసుకురావడం గమనార్హం. కొత్త Sporteqలో భాగంగా లాంచ్ ఎడిషన్ , BE6 Sporteq Four వంటి ప్రత్యేక ఎడిషన్లను సంస్థ ప్రవేశపెట్టింది.

వివరాలు

కొత్త పెయింట్ స్కీమ్.. ప్రత్యేక బ్యాడ్జింగ్

ఇప్పటికే BE6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లో ఫార్ములా ఈ ఎడిషన్, Batman Edition వంటి ప్రత్యేక మోడళ్లు ఉన్నాయి.

అయితే Sporteq వేరియంట్ కేవలం బాహ్య రూపంలో మార్పులతోనే పరిమితం కాలేదు.

ఇందులో టెక్నాలజీ, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లోనూ కీలకమైన అప్‌డేట్లు చేశారు. BE6 Sporteq Launch Edition రూపకల్పనలో ప్రస్తుత BE6 స్టాండర్డ్ వెర్షన్‌కు దగ్గరగా ఉండే డిజైన్‌ను కొనసాగించారు.

అయితే ఈ స్పెషల్ ఎడిషన్ కోసం కొత్త పెయింట్ స్కీమ్‌ను అందించారు.

వెనుక భాగంలో BE6 లెటరింగ్‌తో పాటు ప్రత్యేకంగా " లాంచ్ ఎడిషన్ " బ్యాడ్జ్‌ను అమర్చారు.

వివరాలు

ఆరెంజ్ పెయింట్ స్కీమ్‌..

మరో ఆసక్తికరమైన మార్పు వెనుక లైట్లకు సంబంధించినది.

టెయిల్‌గేట్‌పై ప్రత్యేక సందేశాలను రియర్ లైట్ల సాయంతో ప్రదర్శించే విధానాన్ని ఈ వెర్షన్‌లో అందించారు.

మిగతా బాహ్య డిజైన్ అంశాల్లో మాత్రం పెద్దగా మార్పులు చేయకుండా ప్రస్తుత డిజైన్‌ను కొనసాగించారు.

ఇదే సమయంలో మహీంద్రా BE6 Freedom Editionను కూడా వెల్లడించింది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌కు భిన్నమైన ఆరెంజ్ పెయింట్ స్కీమ్‌ను అందించారు.

ADVERTISEMENT