Page Loader
E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన లాస్ట్ మైల్ మొబిలిటీ

E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 23, 2023
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, మహీంద్రా & మహీంద్రా గ్రూప్ లో ఒక విభాగం. ఇప్పుడు ఈ విభాగం ముంబై, దాని శివారు ప్రాంతాలలో ఆటోరిక్షా స్టాండ్‌లు, ఆటో డ్రైవర్ హోమ్ క్లస్టర్‌లు, జంక్షన్‌ల దగ్గర అనేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. మహీంద్రా అవుట్‌లెట్‌లు, మహీంద్రా మిత్రా టెక్నీషియన్ స్పాట్‌లలో కూడా ఛార్జర్‌లు ఏర్పాటు అయ్యాయి, ఇందులో కస్టమర్ వారి 3-వీలర్‌లను ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ పాయింట్లు మలాడ్, కండివాలి, మీరా రోడ్, నవీ ముంబై, వసాయ్, విరార్, అంధేరి మొదలైన ప్రదేశాలలో ఏర్పడ్డాయి.

మహీంద్రా

మహీంద్రా 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60 కంటే ఎక్కువ మంది మెకానిక్‌లకు శిక్షణ

అయితే ఇది కొనసాగే ప్రక్రియ అని మహీంద్రా బృందం, కీలకమైన వాటాదారులతో పాటు, ముంబై, చుట్టుపక్కల అదనపు ఛార్జింగ్ స్పాట్‌లను గుర్తించి తగిన అనుమతులతో పనిని ప్రారంభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ అదనపు ఛార్జింగ్ పాయింట్ల గురించి ఆటో డ్రైవర్ లకు కూడా తెలియచేశామని కంపెనీ మీడియా ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా, మహీంద్రా 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60 కంటే ఎక్కువ మంది మెకానిక్‌లు LMM సేవా సిబ్బంది సహకారంతో శిక్షణ పొందారు.