LOADING...
మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం
ఫిబ్రవరి 10న వీటిని మహీంద్రా భారతదేశంలో ప్రదర్శిస్తుంది

మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 04, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది. ఈ విభాగంలో మహీంద్రా టాటా మోటార్స్ తో పోటీ పడుతుంది. మహీంద్రా కూడా ఆల్-ఎలక్ట్రిక్ కార్లపై అంచనాలు పెంచుతుంది. కంపెనీ తన M9Electro Gen3 రేస్ కారుతో ఫార్ములా Eలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫిబ్రవరి 11న జరగనున్న మెగా హైదరాబాద్ E-Prixకు ముందు భారతదేశంలో కార్లను ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. XUV.e సబ్-బ్రాండ్ ఇప్పటికే XUV400ని మిడ్-సైజ్ e-SUVగా లాంచ్ చేసింది.

కార్

BE సబ్-బ్రాండ్ లో వచ్చే మోడల్స్ లెవెల్ 2+ అటానమస్ టెక్నాలజీతో వస్తాయి

ఇప్పుడు XUV.e8, XUV.e9లను సరికొత్త INGLO ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించి ప్రీమియం ఆఫర్‌లుగా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తోంది.వీటి ఉత్పత్తి 2024 చివరలో ప్రారంభం కావచ్చు. ఇవి పెద్ద 80kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తాయి. BE సబ్-బ్రాండ్ లో వచ్చే BE.05, BE.07, BE.09 మోడల్స్ లెవెల్ 2+ అటానమస్ టెక్నాలజీతో హైటెక్ క్యాబిన్‌కు సపోర్ట్ చేస్తాయి.ఇండియన్ గ్లోబల్ (INGLO) స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ 60kWh, 80kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ లను అందిస్తుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఈవెంట్‌లో XUV.e మరియు BE సబ్-బ్రాండ్‌లకు సంబంధించిన చాలా వివరాలను అందించినప్పటికీ, రాబోయే ఈవెంట్ లో మరిన్ని వివరాలను అందించే అవకాశాలు ఉన్నాయి.