New Mahindra Thar Og: కొత్త Mahindra Thar OG లాంచ్.. 2.2L డీజిల్‌తో RWD ఆటోమేటిక్, 6 ఎయిర్‌బ్యాగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా కొత్త 2026 Thar OGను భారత మార్కెట్లో విడుదల చేసింది. మూడు డోర్ల ఈ SUV ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.32 లక్షలుగా నిర్ణయించింది. కొత్త థార్‌లో ఇంజిన్లు మాత్రమే కాకుండా డిజైన్, ఇంటీరియర్, సస్పెన్షన్, స్టీరింగ్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, భద్రతా ఫీచర్లలోనూ మార్పులు చేసింది. ముఖ్యంగా 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో RWD ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం Thar OG లైనప్‌లో AXT, LXT, ZXT ట్రిమ్‌లు ఉన్నాయి.
వివరాలు
కొత్త వేరియంట్.. అదనపు ఫీచర్లు
2026 Thar OGలో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కొత్త వేరియంట్‌ను మహీంద్రా తీసుకొచ్చింది.
దీంతో ఫోర్-వీల్ డ్రైవ్ తప్పనిసరి కాని వినియోగదారులకు పెద్ద డీజిల్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ థార్‌ను ఎంచుకునే అవకాశం లభించింది.
కొత్త వేరియంట్లతో పాటు ఆఫ్‌రోడింగ్, సేఫ్టీ అంశాల్లోనూ పలు ఫీచర్లను జోడించింది.
వివరాలు
మూడు ఇంజిన్ ఆప్షన్లు
కొత్త Thar OGలో మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంట్రీ లెవల్ AXT వేరియంట్‌లో 1.5 లీటర్ D117 CRDe డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు.
ఇదే ఇంజిన్ LXT, ZXT ట్రిమ్‌లలోనూ లభిస్తుంది. ఈ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 87.2kW (సుమారు 116.9bhp) పవర్, 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
LXT, ZXT ట్రిమ్‌లలో పెద్ద 2.2 లీటర్ mHawk డీజిల్, 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
2.2 లీటర్ mHawk డీజిల్: పవర్: 150.1bhp టార్క్: 330Nm
2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్: పవర్: 159.6bhp టార్క్: 330Nm
వివరాలు
2.2L డీజిల్‌తో RWD ఆటోమేటిక్
కొత్త Thar OGలో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో RWD ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకురావడం ప్రధాన మార్పుల్లో ఒకటి.
ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఆటోమేటిక్ థార్‌ను కోరుకునే వారికి ఇది మరో ఆప్షన్‌గా నిలుస్తుంది.
ఇప్పటివరకు ఫోర్-వీల్ డ్రైవ్‌తో మాత్రమే పరిగణించే పెద్ద డీజిల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌ను ఇప్పుడు RWDతోనూ ఎంచుకునే అవకాశం ఉంది.
వివరాలు
కొత్త ప్లాట్‌ఫామ్.. మెరుగైన సస్పెన్షన్
2026 Thar OGను M_GLYDE 4G ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఇందులో Watts Linkతో కూడిన Pentalink రియర్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.
రైడ్ కంఫర్ట్, బాడీ కంట్రోల్‌ను మెరుగుపరిచేందుకు Frequency-Dependent Damping టెక్నాలజీతో కూడిన DaVinci Damping వ్యవస్థను కూడా అందించారు.
ఇక ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను కూడా కొత్త థార్‌లో ఇచ్చారు.
దీని వల్ల స్టీరింగ్‌ను తిప్పేందుకు తక్కువ శ్రమ సరిపోతుందని, నేరుగా వాహనం నడుపుతున్న సమయంలో మెరుగైన స్పందన లభిస్తుందని మహీంద్రా పేర్కొంది.
వివరాలు
ఆఫ్‌రోడింగ్ కోసం రియర్ ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్
ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త Tharలో రియర్ ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను అందించారు.
బటన్ నొక్కడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయవచ్చు. వెనుక రెండు చక్రాలను లాక్ చేయడం ద్వారా వాటి మధ్య గ్రిప్‌లో తేడా ఉన్న పరిస్థితుల్లో వాహనం ముందుకు కదలడానికి ఇది సహాయపడుతుంది.
అదే విధంగా Sand, Snow, Mud డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
ఆయా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఇవి ట్రాక్షన్ కంట్రోల్, స్టీరింగ్ అసిస్టెన్స్, యాక్సిలరేటర్ స్పందనను మార్చుతాయి.
ఆటోమేటిక్ వేరియంట్లలో గేర్‌షిఫ్ట్ విధానంపైనా ఈ డ్రైవ్ మోడ్‌ల ప్రభావం ఉంటుంది.
వివరాలు
6 ఎయిర్‌బ్యాగ్‌లు.. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు
సేఫ్టీ విషయంలోనూ మహీంద్రా కొత్త థార్‌లో కీలక మార్పులు చేసింది.
హార్డ్‌టాప్ మోడళ్లలో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
వీటిలో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు నాలుగు HTPS ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
రెండు వరుసల్లో కూర్చున్న ప్రయాణికుల తల, నడుము, ఛాతీ, భుజాలకు రక్షణ కల్పించేలా వీటిని రూపొందించారు.
ఇవే కాకుండా నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, స్టాండర్డ్ ESP 9.3 సూట్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్‌ఓవర్ మిటిగేషన్, హిల్-హోల్డ్ కంట్రోల్, హిల్-డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్
కొత్త Thar OGలో ఐదు-స్లాట్ గ్రిల్, Thar బ్యాడ్జింగ్,LED హెడ్‌ల్యాంప్‌లు, C-షేప్ LED DRLలు ఉన్నాయి.
ముందు భాగంలో LED ఐస్-క్యూబ్ ఫాగ్ ల్యాంప్‌లు, కార్నరింగ్ ల్యాంప్‌లను కూడా అందించారు.
కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు,LED టెయిల్ ల్యాంప్‌లు, కొత్త డిజైన్‌తో కూడిన 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో థార్ లుక్‌లో మార్పులు కనిపిస్తాయి.
ఇంటీరియర్‌లోనూ మార్పులు
క్యాబిన్‌లో ట్రఫుల్స్ బ్రౌన్ లెదరెట్ సీట్లు,సాఫ్ట్-టచ్ డోర్ ప్యానెల్స్,స్టిచ్డ్ ట్రిమ్ వంటి మార్పులు చేశారు.
ముందు ఆర్మ్‌రెస్ట్‌లు,వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలను కూడా జోడించారు.
డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పూర్తిగా మార్చకుండా క్యాబిన్‌లో ఉపయోగించిన మెటీరియల్స్,ఫినిష్, ప్రయాణికుల కంఫర్ట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు.
టాప్-ఎండ్ ZXT ట్రిమ్‌లో అదనంగా 15 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
Mahindra Thar OG ధరలు
AXT 1.5D RWD MT రూ.10.32 లక్షలు
LXT 1.5D RWD MT రూ.12.99 లక్షలు
LXT 2.2D RWD AT రూ.16.49 లక్షలు
LXT 2.2D 4WD MT రూ.16.43లక్షలు
LXT 2.2D 4WD AT రూ.18.00లక్షలు
LXT 2.0T RWD AT రూ.14.77లక్షలు
LXT 2.0T 4WD MT రూ.15.60లక్షలు
LXT 2.0T 4WD AT రూ.17.23లక్షలు
ZXT 1.5D RWD MT రూ.13.99లక్షలు
ZXT 2.2D RWD AT రూ.17.49లక్షలు
ZXT 2.2D 4WD MT రూ.17.49లక్షలు
ZXT 2.2D 4WD AT రూ.18.99లక్షలు
ZXT 2.0T RWD AT రూ.16.09లక్షలు
ZXT 2.0T 4WD MT రూ.16.60 లక్షలు
ZXT 2.0T 4WD AT రూ.17.75 లక్షలు