హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా
స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు. ప్రత్యేకమైన ఆల్-ఎలక్ట్రిక్ SUV రేసింగ్ స్పిరిట్ నుండి ప్రేరణతో రూపొందింది C-పిల్లర్‌లపై 'మహీంద్రా రేసింగ్' పేరు కూడా ఉంటుంది. మహీంద్రా గత ఏడాది సెప్టెంబర్‌లో XUV400ని పరిచయం చేసింది. భారతదేశానికి చెందిన దిగ్గజ SUV తయారీ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా తన సత్తా చాటాలనుకుంటుంది . మహీంద్రా ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ తొమ్మిదవ సీజన్‌లో M9Electro Gen3 రేస్ కారుతో కూడా పోటీపడుతోంది.
ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
మహీంద్రా XUV400 ఫార్ములా E ఎడిషన్ లో బ్లాక్, కాపర్ షేడ్స్‌తో పాటు బ్రాండ్ సిగ్నేచర్ రెడ్ కలర్ ఉన్న ప్రత్యేక లివరీ ఉంది. మహీంద్రా XUV400 ఫార్ములా E ఎడిషన్ 34.5kWh లేదా 39.4kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. ఇది 34.5kWh బ్యాటరితో 375కిమీ, 39.4kWh బ్యాటరితో 456కిమీ వరకు నడుస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS ఉన్నాయి. మహీంద్రా XUV400 ఫార్ములా E ఎడిషన్ ధరను ఇంకా తయారీ సంస్థ వెల్లడించలేదు, ఎందుకంటే ఈ వాహనం సాధారణ అమ్మకాల కోసం కాదు. మిగతా ప్రత్యేక క్రియేషన్‌ల లాగానే స్వచ్ఛంద ప్రయోజనాల కోసం వేలం వేసే అవకాశం ఉంది.