Mahindra XUV700 : అమ్మకాల్లో మహీంద్ర XUV700 సరికొత్త రికార్డు
మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఎస్‌యూవీ.. మహీంద్రా XUV700 అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇండియాలో 29 నెలలో 1,50,000 యూనిట్లకు పైగా విక్రయించి అరుదైన రికార్డును సృష్టించింది. కేవలం 12 నెలల్లో 50,000 యూనిట్లు అమ్ముపోవడం విశేషం. మహీంద్రా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు SUVలలో మహీంద్రా XUV700 ఒకటిగా నిలిచింది. XUV700 2022లో ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY)గా కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఇది లగ్జరీ ఆటోమొబైల్ విభాగంలో ఓ బెంచ్‌మార్క్‌ను సొంతం చేసుకుంది.
మహీంద్ర XUV700లో 30 వేరియంట్లు
XUV700 మొత్తం 30 వేరియంట్‌లలో 5-సీటర్, 7-సీటర్‌లో అందుబాటులో ఉంది. ఇది 200hp శక్తిని, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. AX7, AX7L ట్రిమ్‌ల కోసం ఆల్-వీల్-డ్రైవ్ అందుబాటులో ఉంది. XUV700లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో బూస్టర్ హెడ్‌లైట్లు, లెదర్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. SUVలో 3D సరౌండ్ సౌండ్‌తో సోనీ కస్టమ్-బిల్ట్ 12-స్పీకర్ సెటప్ కూడా అమర్చారు. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి. నవంబర్ 2021లో జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో XUV700 ఫైవ్ స్టార్ రేటింగ్ ను పొందిన విషయం తెలిసిందే.