Maruti e Vitara : రూ.25వేలు టోకెన్‌తో మారుతి ఎలక్ట్రిక్ కారు బుకింగ్.. మీరు త్వరపడండి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును, E-Vitara సెడాన్‌ను, ఆటో ఎక్స్‌పోలో చక్కగా ప్రదర్శించింది.
ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌పై ప్రజలకు మరింత ఆసక్తి పెరిగింది. దీంతో మారుతి సుజుకీపై అంచనాలు అమాంతంగా పెరిగాయి.
ఈ కారును కొనాలని ఆసక్తి ఉన్న వారికి ముందస్తు బుకింగ్ అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ బుకింగ్ ప్రక్రియను అనధికారికంగా ప్రారంభించారు.
రూ. 25వేలు టోకెన్లు చెల్లిస్తే ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కారును త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నారు. ధరను ఇప్పటివరకు ప్రకటించలేదు.
గ్రాండ్ విటారా మాదిరిగా, E-Vitara కూడా మూడు వేరియంట్లలో రానుంది. ఇందులో డెల్టా, జీటా, ఆల్ఫా మోడల్స్ ఉంటాయి.
Details
బ్యాటరీ ప్యాక్, డ్రైవింగ్ మోడ్‌లు
బేసిక్ వేరియంట్: 49-kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.
టాప్ వేరియంట్: 61-kWh బ్యాటరీ ప్యాక్ పొందవచ్చు.
కార్కి పరిధి సుమారు 500 కిలోమీటర్లుగా ఉండనుందని, బ్యాటరీ ప్యాక్‌ను మెరుగైన పనితీరు, సేఫ్టీ కొరకు రూపొందించారు.
E-Vitara బ్యాటరీ ప్యాక్ 120 లిథియం-అయాన్ సెల్స్‌ను కలిగి ఉంది. ఈ సెల్స్ -30°C నుండి 60°C వరకు ఉన్న ఉష్ణోగ్రతల్లో కూడా సజావుగా పనిచేస్తాయని టెస్టింగ్‌లో నిరూపించాయి.
అధునాతన ఉష్ణ నిర్వహణ వ్యవస్థతో పాటు లో-అయాన్ కూలెంట్ కూడా అమర్చారు.
ఇంకా ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లున్నాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
Details
ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఫీచర్లు
ఈ మారుతి కారులో అనేక ఆధునిక సాంకేతికతలు అమర్చారు.
ఇన్ఫోటైన్‌మెంట్: 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25 అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది.
కమ్ఫర్ట్: ముందస్తు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు ఉండటం వలన ప్రయాణీకులకు మంచి సౌకర్యం కలుగుతుంది
. కనెక్టివిటీ & సౌండ్:
వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు: అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతికతలు కూడా ఇక్కడ ఉన్నాయి.