NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్ 
    తదుపరి వార్తా కథనం
    Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్ 
    మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్

    Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్ 

    వ్రాసిన వారు Stalin
    Mar 23, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్,బాలెనోలలో ప్రధాన లోపాలు కనుగొన్నారు.

    మారుతీ సుజుకీ 16 వేలకు పైగా కార్లను రీకాల్ చేసింది.

    బాలెనో 11,851యూనిట్లు,వ్యాగన్ఆర్ 4,190యూనిట్లు రీకాల్ చేశారు.

    ఈ రెండు కార్ల ఫ్యూయల్ పంప్ మోటర్‌లో లోపం ఉందని దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా శుక్రవారం తెలిపింది.

    కార్లు నాసిరకంగా ఉన్న వారి కార్లను కంపెనీ రిపేర్ చేస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో,హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ రీకాల్ గురించి తెలియజేస్తూ మారుతీ సుజుకి ఒక ప్రకటన విడుదల చేసింది.

    సాంకేతిక లోపాల కారణంగా ఈ రెండు కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

    ఇంధన పంపులో లోపం కారణంగా,కారు వినియోగదారులు ఇంజిన్‌ను ప్రారంభించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

    మారుతీ 

    ఈ లోపం Baleno-WagonRలో కనుగొన్నారు 

    జూలై 30, 2019 నుంచి నవంబర్ 1, 2019 మధ్య కాలంలో తయారు చేసిన బాలెనో 11,851యూనిట్లు,వ్యాగన్ఆర్ 4,190యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

    ప్రకటన ప్రకారం,ఈ కార్ల ఫ్యూయల్ పంప్ మోటారులో ఒక భాగంలో లోపం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

    ఇంజిన్ ఆగిపోవడం లేదా ఇంజిన్‌ను ప్రారంభించడంలో సమస్య ఉండవచ్చు.

    కారుకి ఉచితంగా మరమ్మతులు కారులో లోపం ఉన్న కార్ల యజమానులకు సమాచారం ఇస్తామని మారుతీ సుజుకీ తెలిపింది.

    అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల ద్వారా కంపెనీ బాధిత కస్టమర్‌లను సంప్రదిస్తుంది.

    ఇది కాకుండా, లోపభూయిష్టంగా ఉన్న ఏదైనా భాగం ఉచితంగా భర్తీ చేస్తుంది. రీప్లేస్‌మెంట్ విడిభాగాల కోసం కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీ విధించరు.

    మారుతి 

    మీ కారుని ఇలా చెక్ చేసుకోండి 

    మీరు జూలై 30, 2019,నవంబర్ 1, 2019మధ్య తయారు చేసిన Baleno లేదా WagonRని కలిగి ఉంటే, జాగ్రత్తగా ఉండండి.

    మీ కారులో కూడా లోపం ఉండే అవకాశం ఉంది. కంపెనీ స్వయంగా మీకు ఈ సమాచారాన్నిఇచ్చినప్పటికీ,మీకు కావాలంటే,మీరు మీ కారు గురించి కూడా తెలుసుకోవచ్చు.

    సులభమైన మార్గంలో మీ కారు బాగానే ఉందా లేదా అందులో ఏదైనా లోపం ఉందా అనేది మీకు తెలుస్తుంది.

    మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు రీకాల్ చేసిన కార్ల గురించి తెలుసుకోవచ్చు.

    ఇది కాకుండా, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ కారు వివరాలను కూడా తనిఖీ చేయవచ్చు.

    మారుతి బాలెనో,వ్యాగన్‌ఆర్‌లను రీకాల్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.

    రీకాల్ 

    ఒక సంవత్సరంలో రెండవసారి రీకాల్ 

    దీని తర్వాత, దిగువన CLICK HERE అప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

    ఇప్పుడు ఇక్కడ మీరు మీ కారు ఛాసిస్ నంబర్‌ను ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

    మీ కారులో ఏదైనా లోపం ఉంటే, దానిని రిపేర్ చేయవలసి వస్తే మీకు దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుస్తాయి.

    మారుతీ సుజుకీ కార్లను రీకాల్ చేయడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి.

    గత ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 7,213 యూనిట్ల మారుతి బాలెనో ఆర్‌ఎస్ (పెట్రోల్) రీకాల్ చేసింది.

    ఈ కార్లు అక్టోబర్ 27, 2016, నవంబర్ 1, 2019 మధ్య తయారు చేయబడ్డాయి.

    ఈ కార్లలో వాక్యూమ్ పంప్‌లో లోపాన్ని కనుగొన్నారు,దీని కారణంగా బ్రేక్ వేయడంలో ఇబ్బంది తలెత్తింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతి సుజుకీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మారుతి సుజుకీ

    టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో ఎక్స్‌పో
    మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఆటో మొబైల్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..? ఆటో మొబైల్
    SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025