Maruti Suzuki: మరోసారి మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. ఈసారి ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని కంపెనీ అధికారిక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా 4శాతం వరకు ఈ పెంపు (Price Hike) ఉంటుందని తెలిపింది.
ధరలు పెంచడానికి కారణమేమిటి? తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ స్పష్టంచేసింది.
ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై కొంత భారాన్ని మోపక తప్పడం లేదని పేర్కొంది.
Details
రెండు నెలల్లో ధరలు పెంచడం ఇది రెండోసారి
ప్రతి మోడల్‌కు భిన్నంగా ఈ పెంపు అమలులోకి రానుంది.
ఎన్ని మోడళ్లపై పెంపు? దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్ ఆల్టో K10 నుంచి మల్టీపర్పస్ వెహికల్ ఇన్విక్టో వరకు పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది.
వాటి ధరలు రూ.4 లక్షల నుంచి రూ.29 లక్షల వరకూ ఉన్నట్లు తెలిసింది. గత రెండు నెలల్లో మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరిలో మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.32,500 వరకు పెంచారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.