Page Loader
Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం 
రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం

Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో మారుతీ సుజుకీ తన నూతన మోడల్, కొత్త డిజైర్‌ను రేపు విడదల చేయనుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. మారుతి సుజుకి నుంచి ఇప్పటివరకు విడుదలైన అత్యంత సురక్షిత కారుగా రికార్డుకెక్కింది. ప్రీబుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, బుకింగ్ కోసం రూ. 11వేలు అడ్వాన్స్‌ చెల్లించాలి. కొత్త డిజైర్‌ను LXi, VXi, ZXi, ZXi ప్లస్ వేరియంట్లలో అందిస్తున్నారు. టాప్-ఎండ్ మోడల్‌లో ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 2024 డిజైర్‌లో ఎక్స్‌టీరియర్ పూర్తిగా కొత్త లుక్‌తో రూపొందించారు. స్క్వేర్‌ ఆకారపు ఫ్రంట్ గ్రిల్, కొత్త లైటింగ్ సెటప్, మార్పులు చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు, ఫ్లాట్ హుడ్ వంటి డిజైన్లను కలిగి ఉంది.

Details

కొత్త డిజైర్‌ లో అత్యాధునిక ఫీచర్లు

వీటిలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, మొబైల్ వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో స్లోప్‌డ్ రూఫ్, 15-అంగుళాల కొత్త అలాయ్ వీల్స్ ఉంటాయి. 2024 డిజైర్‌లో 1.2-లీటర్ Z సిరీస్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 80హెచ్‌పి శక్తిని, 112ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.