Page Loader
దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!
దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!

దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకీ ఒకటి. వాహనదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతోంది. తాజాగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ను ఆ సంస్థ దక్షిణాఫ్రికాలో రిలీజ్ చేసింది. రాబోవు రాజులో XL6, ఐదు డోర్ల జిమ్మీ SUV లను లాంచ్ చేయనున్నారు. మారుతి Fronx SUV ధర భారతదేశంలో (ఎక్స్-షోరూమ్) రూ.7.46 లక్షలు ఉండనుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో సుజుకి ఫ్రాంక్స్, GL, GLX అనే రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్, 103 బిహెచ్‌పి పవర్ తో పాటు 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Details

మారుతి సుజుకిలో అత్యాధునిక ఫీచర్లు

లుక్స్, ఫీచర్లు ఇతర స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే దక్షిణాఫ్రికాలో లాంచ్ అయిన ఫ్రాంక్స్, ఇండియాలో విక్రయించే ఫ్రాంక్స్ కు భిన్నంగా లేదని చెప్పొచ్చు. ఈ ఎస్‌యూవీలో LED హెడ్‌లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మూడు బ్లాక్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ లో వస్తోంది. ఈ వెహికల్ ఆరు కలర్లలో ముందుకొచ్చింది. మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, అండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి లక్షణాలను అందిస్తుంది. GLX వేరియంట్‌లో హెడ్-అప్ డిస్‌ప్లే, 4.2-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అదనపు ఫీచర్లను పొందుతాయి. భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రూ.7.46 లక్షల ఉండగా.. దక్షిణాఫ్రికాలో దాదాపుగా రూ.14.64 లక్షలు ఉంది.