మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..?
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ల ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. ఈ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో కొత్త ఫీచర్ ను జోడించడంతో ఈ ధరను పెంచినట్లు సమాచారం. దీంతో ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది. ప్రయాణ సమయంలో డ్రైవర్లు, పాదాచారుల రక్షణ కోసమే పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్) అనే కొత్త ఫీచర్ ను అందుబాటులో తెచ్చామని కంపెనీ పేర్కొంది.
కొత్త టెక్నాలజీతో ప్రమాదాాలు తగ్గే అవకాశం
ఈ కొత్త టెక్నాలజీ వల్ల ప్రమాదాలు మరింత తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రాండ్ విటారా మారుతి కొత్త తరం K-సిరీస్ 1.5-లీటర్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 99 బిహెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ కోసం ఉపయోగించే e-CVT ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. CNG వెర్షన్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఉండనున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ధర రూ.18.29-19.79 లక్షలుగా ఉంది.