Maruti Suzuki Sales : భారత మార్కెట్లో మారుతి సుజుకి హవా.. ఫిబ్రవరిలో 1.6 లక్షల కార్ల విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో మారుతీ సుజుకీకి ఎనలేని డిమాండ్ ఉంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో పోటీ పడి, కార్ల అమ్మకాల్లో తిరుగులేని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటోంది.
2025 ఫిబ్రవరిలో మారుతి సుజుకి 1,60,791 కార్లను విక్రయించడం ద్వారా మరోసారి దేశీయ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
అయితే ఏడాది ప్రాతిపదికన మారుతి సుజుకి అమ్మకాలు కేవలం 0.32 శాతం మాత్రమే పెరిగాయి. 2024 ఫిబ్రవరిలో కంపెనీ 1,60,271 యూనిట్లను విక్రయించింది.
నెలవారీ ప్రాతిపదికన అమ్మకాల తగ్గుదల
మారుతి సుజుకి జనవరి 2025లో 1,73,599 కార్లను విక్రయించింది. దీంతో నెలవారీ ప్రాతిపదికన 7.38 శాతం అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. అంతేకాకుండా కంపెనీ ఎగుమతుల పరంగా కూడా వెనకబడి ఉంది.
Details
వివిధ సెగ్మెంట్‌లలో అమ్మకాలు
మిడ్-సైజ్ సెడాన్: మారుతి సుజుకి సియాజ్ 1,097 కొత్త కస్టమర్లను ఆకర్షించింది.
వాన్ సెగ్మెంట్: మారుతి సుజుకి ఈకో 11,000 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
మినీ సెగ్మెంట్ : ఆటో, ఎస్-ప్రెస్సో కార్లు 10,226 మంది కొనుగోలుదారులను కలిగి ఉన్నాయి.
కాంపాక్ట్ సెగ్మెంట్ : బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ కార్లను 72,000 మంది కొనుగోలు చేశారు.
యుటిలిటీ వెహికిల్స్ : ఈ విభాగంలో 65,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
Details
ఎగుమతుల లోటు
మారుతి సుజుకి ఫిబ్రవరి 2025లో 25,021 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2024 ఫిబ్రవరిలోని 28,927 యూనిట్ల కంటే 13.50 శాతం తక్కువ.
మారుతి సుజుకి వృద్ధి స్థితిగతులు
మొత్తంగా చూస్తే మారుతి కార్ల అమ్మకాలలో స్వల్పంగా వృద్ధి నమోదైంది.
అయితే, కొన్ని విభాగాల్లో అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,60,791 యూనిట్లు కాగా, 2024 ఫిబ్రవరిలో ఇవి 1,60,271 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.