మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకీ నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న మారుతి ఇన్‌విక్టో ధర రూ.24.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. జెటా + (7 సీటర్), జెటా + (8 సీటర్), ఆల్ఫా + (7 సీటర్) వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది.
దీని లుక్ చూస్తే అత్యంత స్టైలిష్‌గా, రాయల్‌గా అదరగొడుతోంది. మారుతి సుజుకీ ఉత్పత్తుల్లో ఇదే అత్యంత ఖరీదైంది.
రూ.25వేలు అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.నెలవారీగా రూ.61,860లపై సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా మారుతి సుజుకి ఇచ్చింది
Details
9.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగం
ఇప్పటికే ఇన్విక్టో కోసం 6,200 బుకింగ్స్ నమోదయ్యాయి. నెక్సా బ్లూ, మ్యాస్టిక్ వైట్‌తోపాటు నాలుగు రంగుల్లో మారుతి సుజుకి ఇన్‌విక్టో లభించనుంది.
డ్యుయల్ పవర్ ట్రైన్ సిస్టమ్ తో కూడిన ఇంజిన్ ఇది. ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండనుంది.
ఈ కారును నెక్సా ప్రీమియం రిటైల్ నెట్ వర్క్ షోరూంల్లో ఏర్పాటు చేశారు.
కేవలం 9.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అదే విధంగా 23.24 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 4755మిమీ పొడవు, 1850మిమీ వెడల్పు, 1795 ఎత్తు ఉంటుంది.