LOADING...
Maruti Suzuki: ధరలు పెరిగినా టెన్షన్ లేదు.. 4 మారుతీ కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్
ధరలు పెరిగినా టెన్షన్ లేదు.. 4 మారుతీ కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్

Maruti Suzuki: ధరలు పెరిగినా టెన్షన్ లేదు.. 4 మారుతీ కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 11, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తొలి సారి కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వాహన ధరల నేపథ్యంలో ఎంట్రీ-లెవల్ మోడళ్ల కోసం పరిమిత కాలానికి ప్రత్యేక ధర రక్షణ (ప్రైస్ ప్రొటెక్షన్) పథకాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ ఆల్టో K10, వ్యాగన్‌ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడళ్లకు వర్తిస్తుంది. 2026 జూన్ 14లోపు ఈ వాహనాలను బుక్ చేసుకునే కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

వివరాలు

పాత ధరలకే ఆ కార్లు..

ఈ పథకం ప్రకారం నిర్ణీత గడువులోపు పై నాలుగు అరేనా మోడళ్లలో ఏదైనా బుక్ చేసుకున్న కస్టమర్లపై తాజా ధరల పెంపు ప్రభావం ఉండదు. జూన్ 2026 నుంచి తమ వాహనాల ధరలను గరిష్టంగా రూ.30 వేల వరకు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇప్పటికే ప్రకటించింది. ద్రవ్యోల్బణం, ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు మారవచ్చు. అయితే ఈ ప్రత్యేక ప్రైస్ ప్రొటెక్షన్ ఆఫర్ కింద బుక్ చేసిన వినియోగదారులు డెలివరీ ఆలస్యంగా జరిగినా పాత ధరలకే వాహనాన్ని పొందగలరు.

వివరాలు

అమ్మకాల పరంగా ముందంజ..

చిన్న కార్ల విభాగం దీర్ఘకాలం తర్వాత క్రమంగా కోలుకుంటోందని మారుతీ సుజుకీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం, ఈ సెగ్మెంట్ కారణంగా మార్కెట్ వాటాలో సుమారు 300 నుంచి 400 బేసిస్ పాయింట్ల మేర పునరుద్ధరణ కనిపించింది. ప్రస్తుతం ఎస్‌యూవీలు అమ్మకాల పరంగా ముందంజలో ఉన్నప్పటికీ, ఆల్టో K10, వ్యాగన్‌ఆర్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారాలనుకునే అనేక భారతీయ కుటుంబాలకు ఇవే మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి.

Advertisement

వివరాలు

డీలర్ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా నిర్ణయం..

మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, డీలర్ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే బడ్జెట్‌ను విస్తరించి కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు ఆకస్మిక ధరల పెంపుతో నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ మోడళ్ల కోసం మారుతీ సుజుకీ 'సుహానా సఫర్' పేరుతో కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్ కొనుగోలును మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Advertisement

వివరాలు

కారు కొనుగోలుదారులకు ఇక మరింత సులభం..

ఈ పథకం కింద వినియోగదారులు సాధారణ ఈఎంఐకి సమానమైన స్థిర మొత్తాన్ని ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలి. మూడు నుంచి ఆరు నెలల తర్వాత ఆ ఖాతాలో కూడిన మొత్తాన్ని అదే బ్యాంకు నుంచి తీసుకునే కారు రుణానికి డౌన్ పేమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. దీంతో కారు కొనుగోలుకు అవసరమైన ప్రారంభ వ్యయాన్ని సులభంగా సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది.

Advertisement