Page Loader
Maruti Suzuki Swift Blitz Edition: భారత్ లో మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్.. 25 కిలోమీటర్ల మైలేజీ..!
భారత్ లో మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్.. 25 కిలోమీటర్ల మైలేజీ..!

Maruti Suzuki Swift Blitz Edition: భారత్ లో మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్.. 25 కిలోమీటర్ల మైలేజీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ, ఇండియాలో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ క్రమంలో కొన్ని యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ప్రత్యేక ప్రయత్నం చేస్తోంది. మారుతి స్విఫ్ట్ అమ్మకాలను పెంచడంలో తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని రోజుల్లోనే, బాలెనో రీగల్ ఎడిషన్, వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్, గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్, ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. తాజాగా, స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

వివరాలు 

స్విఫ్ట్ బ్లిట్జ్ ప్రత్యేక ఎడిషన్ 

స్విఫ్ట్ బ్లిట్జ్ ఐదో ప్రత్యేక ఎడిషన్‌గా పరిగణించవచ్చు. మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ అమ్మకాలను పెంచడానికి డీలర్‌లు పరిమిత కాలానికి ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విక్రయించనున్నారు. స్విఫ్ట్ బ్లిట్జ్ స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసిన వారికి రూ. 49,848 విలువైన యాక్సెసరీ కిట్ ఉచితంగా అందించబడుతుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ LXI, VXI (O), VXI, VXI AMT, VXI (O) AMT వంటి ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

వివరాలు 

ఫీచర్లు, ధర 

ఈ అన్ని వేరియంట్‌లలో, స్టాండర్డ్ ఫీచర్‌లతో పాటు, రియర్ అండర్‌బాడీ స్పాయిలర్, షైనింగ్ డోర్ సిల్స్, డోర్ వైజర్స్, బూట్ పైన స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్స్, సైడ్ మోల్డింగ్ యాక్సెసరీలు ఉచితంగా లభిస్తాయి. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి 8.02 లక్షల వరకు ఎక్స్‌ షోరూమ్‌గా ఉంటుంది. ఇంజిన్, పనితీరులో ఎటువంటి మార్పులు ఉండవు.

వివరాలు 

ఇంజిన్ పనితీరు 

స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ అదే జెడ్-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 80.46 బిహెచ్‌పీ పవర్ మరియు 111.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ యూనిట్ అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్‌లో 24.80 కిమీ, ఆటోమేటిక్‌లో 25.75 కిమీ మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ ఫీచర్లు సేఫ్టీ కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి పలు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.