Maruti Suzuki: ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న మారుతీ సుజుకీ వాహన ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ (Maruti Suzuki) తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది.
వాహన మోడల్ ఆధారంగా, ధర పెంపు రూ.32,500 వరకు ఉండొచ్చని వివరించింది.
ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా వాహన ధరల పెంపు తప్పనిసరి అయినట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.
వినియోగదారులకు ఈ పెంపును బదిలీ చేయడం తప్ప మరే మార్గం లేదని పేర్కొంది. మోడల్ ఆధారంగా వాహన ధరలు పెరిగిపోతాయని అంచనా వేసింది.
వివరాలు
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం:
సెలెరియో (Celerio) పై రూ.32,500 పెంపు
ఇన్విక్టో (lnvicto) ప్రీమియం మోడల్‌పై రూ.30,000 పెంపు
వ్యాగన్‌ఆర్ (Wagon-R) పై రూ.15,000 పెంపు
స్విఫ్ట్ (Swift) పై రూ.5,000 పెంపు
ఎస్‌యూవీ బ్రెజా (Breza) పై రూ.20,000 పెంపు
విటారా (Vitara) పై రూ.25,000 పెంపు
ఆల్టో కే10 (Alto K10) పై రూ.19,500 పెంపు
ఎస్-ప్రెసో (S-Presso) పై రూ.5,000 వరకు పెంపు
ఇక ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనో (Baleno)పై రూ.9,000, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్(Franks) పై రూ.5,500, డిజైర్ (Dzire) పై రూ.10,000 పెంపు ఉండనుంది.
ప్రస్తుతం, మారుతీ సుజుకీ ఆల్టో కే10 నుంచి ఇన్విక్టో వరకు రూ.3.99లక్షల నుంచి రూ.28.92 లక్షల మధ్య వివిధ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది.