Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్‌లో విక్రయించే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది. కంపెనీ తన నెక్సా వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలను గరిష్టంగా రూ.50,000 వరకు పెంచింది. వీటిలో Ciaz, Baleno, Invicto మరియు XL6 వంటి వాహనాలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లోనే మారుతీ తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. బాలెనో వెర్షన్ కంపెనీ అత్యుత్తమంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ వాహనాల్లో ఒకటి. దీంతో మారుతీ సుజుకీ తన బాలెనో హ్యాచ్‌బ్యాక్ కారు ధరలను రూ.5,000 పెంచింది. అయితే ఈ వాహనం మోడల్‌లోని AMT వెర్షన్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
ఆల్ఫా ప్లస్ వేరియంట్ పై రూ.50 వేల పెరుగుదల
మారుతి సుజుకీ గ్రాండ్ విటారా SUV మాన్యువల్ వేరియంట్ ధరను రూ.10,000 పెంచింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధరపై ఈ పెరుగుదల ఉంటుంది. కంపెనీ ఈ వాహనాన్ని 2022లో విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఈ వాహనం 7-సీటర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది. ఫ్రాంక్స్ కారు అన్ని మాన్యువల్ మోడల్స్ ధరలపై కంపెనీ రూ. 5,000 పెంచింది. XL6కు చెందిన అన్ని మాన్యువల్ వేరియంట్ల ధరలపై ఇప్పుడు రూ. 5,000వరకు పెరిగాయి. ఇన్విక్టో ఎంపీవీ కారు ధరలను మారుతి సుజుకి ధరలను అత్యధికంగా పెంచింది. ఈ వాహనం ఆల్ఫా ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరపై ఏకంగా రూ. 50,000పెంచింది. అయితే ఈ వాహనం ఇతర వేరియంట్‌ల ధరలు రూ. 39,000వరకు పెరిగాయి.