LOADING...
Maruti Suzuki Victoris: మారుతీ సుజుకీ విక్టోరిస్.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
మారుతీ సుజుకీ విక్టోరిస్.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?

Maruti Suzuki Victoris: మారుతీ సుజుకీ విక్టోరిస్.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 'మారుతీ సుజుకీ విక్టోరిస్' ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కస్టమర్లలో మంచి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కొత్త మోడల్, ఇప్పటికే సెగ్మెంట్‌లోని టాప్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని మారుతీ చెబుతోంది. అయితే ఇందులో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఎంట్రీ లెవెల్ ఎల్‌ఎక్స్‌ఐ మోడల్ కన్నా ఎక్కువ ఫీచర్లను కోరుకునే వారికి 'వీఎక్స్‌ఐ' వేరియంట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ధరలో కొంచెం ఎక్కువైనా, అదనంగా ఇచ్చే ప్రీమియం ఫీచర్లతో మధ్యస్థ ధర-ప్రీమియం ఫీచర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడుస్తోంది. అందుకే దీన్ని వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌గా భావిస్తున్నారు.

Details

విక్టోరిస్ వీఎక్స్‌ఐ: డిజైన్

బయట డిజైన్‌లో బేస్ ట్రిమ్‌తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ ఓఆర్‌వీఎంలు, డోర్ హ్యాండిల్స్ స్థానంలో బాడీ కలర్ ఫినిష్ వస్తుంది. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రెయిల్స్ లుక్‌ను ప్రీమియమ్‌గా మారుస్తాయి. ముందు-వెనుక సిల్వర్ స్కిడ్ ప్లేట్లు SUV స్టాన్స్‌ను పెంచుతాయి. అయితే వీల్స్ విషయంలో మాత్రం 17-ఇంచ్ స్టీల్ వీల్స్ (కవర్లతో) మాత్రమే ఉంటాయి. అల్లాయ్ కోసం పై వేరియంట్లకే వెళ్లాలి. విక్టోరిస్ వీఎక్స్‌ఐ: క్యాబిన్ & ఫీచర్లు లోపలి భాగంలో మరింత మెరుగైన అనుభవం డ్యూయల్ టోన్ (బ్లాక్-ఆఫ్ వైట్) ఇంటీరియర్. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వానిటీ మిర్రర్స్, ఫుట్‌వెల్ లైటింగ్.

Details

 టెక్నాలజీ & కంఫర్ట్ 

7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే. కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వాయిస్ అసిస్టెంట్. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లలో 10.25-ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే, మల్టీ డ్రైవ్ మోడ్. ఆటో క్లైమేట్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ. టిల్ట్-టెలిస్కోపిక్ స్టీరింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు. రియర్ USB-C ఛార్జింగ్ పోర్టులు, స్ప్లిట్ రియర్ బెంచ్.

Details

 సేఫ్టీ 

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు. ABS with EBD. రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ముఖ్యంగా, మొత్తం విక్టోరిస్ లైన్‌అప్ భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది

Details

 విక్టోరిస్ వీఎక్స్‌ఐ: స్పెసిఫికేషన్స్

మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లు: 1.5L మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ CNG వేరియంట్ CNG: 88PS పవర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: 116PS పవర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పాడిల్ షిఫ్టర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో పాదచారుల కోసం అకౌస్టిక్ వెహికిల్ అలర్ట్ సిస్టమ్ ధర మారుతీ సుజుకీ విక్టోరిస్ వీఎక్స్‌ఐ ఎక్స్-షోరూం ధర: రూ.10.85 లక్షలు. మొత్తంగా చూసుకుంటే విక్టోరిస్ వీఎక్స్‌ఐ వేరియంట్ ధర-ఫీచర్ల పరంగా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పొచ్చు.