LOADING...
Maruti Suzuki: మారుతి సుజుకి వాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్.. వివరాలివే..
మారుతి సుజుకి వాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్.. వివరాలివే..

Maruti Suzuki: మారుతి సుజుకి వాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్.. వివరాలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును మారుతీ సుజుకీ ఈ రోజు (జూన్ 4) అధికారికంగా విడుదల చేయనుంది. జూన్ 5న జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు ఈ కీలక ఆవిష్కరణ జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి హాజరుకానున్నారు.

వివరాలు

ఇథనాల్‌ను వినియోగించే దిశగా అడుగులు..

ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం వైపు దేశం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ లాంచ్ కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇథనాల్‌ను వాహన ఇంధనంగా ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది. అయితే, విడుదల చేయబోయే మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.

వివరాలు

తొలిసారిగా ప్రజల ముందుకు..

అయినప్పటికీ, గతంలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన మారుతి సుజుకి వాగన్‌ఆర్ లేదా ఫ్రాంక్స్ మోడళ్లలో ఏదో ఒకదానిపై ఆధారంగా ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వాహనం ఏ మోడల్ అనే విషయాన్ని మారుతి సుజుకి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పరిశ్రమ వర్గాల్లో రెండు మోడళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాగా, మరొకటి మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. వాస్తవానికి వాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను 2024లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్సోపో 2024లో మారుతి సుజుకి తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

Advertisement