75వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerieను లాంచ్ చేయనున్నMaserati
ఇటాలియన్ లగ్జరీ, స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Maserati గ్లోబల్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ GranTurismo PrimaSerie మోడల్‌ను ప్రకటించింది, కేవలం 75 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ విభిన్నమైన గ్రిజియో లామిరా కాంట్రాస్టింగ్ బ్రైట్ రెడ్ యాక్సెంట్, నీరో కామెటా సబ్టిల్ పుదీనా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది Maserati GranTurismoను, 4.2-లీటర్ V8 ఇంజన్ తో అందుబాటులో ఉన్న ధరకు అందించడం ద్వారా ఆటో మొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది.ఇప్పుడు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, PrimaSerie అనే పేరుతో GranTurismo ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ హబ్‌క్యాప్స్, డ్యూయల్-టోన్ లెదర్ అప్హోల్స్టరీపై ప్రత్యేకమైన లోగో ఉంటుంది.
GranTurismo PrimaSerie ధర, ఇతర వివరాలను ఇంకా వెల్లడించని Maserati
Maserati GranTurismo PrimaSerie స్టాండర్డ్ మోడల్ బ్లాక్డ్-అవుట్ గ్రిల్ పై "ట్రైడెంట్" లోగోతో, స్వెప్ట్‌బ్యాక్ LED హెడ్‌లైట్లు, ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, స్లోపింగ్ రూఫ్‌లైన్ తో వస్తుంది. దీనికి 3.0-లీటర్ V6 ఇంజన్ సపోర్ట్ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. Maserati GranTurismo PrimaSerie ధర, ఇతర వివరాలను వాహన తయారీ సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ భారతదేశంలో ప్రీమియం ధరలో అంటే రూ. 2.25 కోట్లు(ఎక్స్-షోరూమ్) ఉండచ్చని అంచనా వేస్తున్నారు.