Page Loader
Matter Aera Electric Bike: మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒకే ఛార్జ్‌తో 172 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం! 
మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒకే ఛార్జ్‌తో 172 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం!

Matter Aera Electric Bike: మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒకే ఛార్జ్‌తో 172 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మ్యాటర్, భారత మార్కెట్లోకి తన తాజా ఎలక్ట్రిక్ బైక్ 'మ్యాటర్ ఎరా'ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో విప్లవాత్మక మోడల్‌గా ఈ బైక్‌ను దిల్లీలో అధికారికంగా లాంచ్ చేశారు. ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లు, మెరుగైన రేంజ్ వంటి అంశాలతో ఇది వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మ్యాటర్ ఎరా బైక్ ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.94 లక్షలుగా నిర్ణయించారు. వినియోగదారులు ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో గానీ, మ్యాటర్ షోరూమ్‌లలో గానీ బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ బైక్‌కు మూడు సంవత్సరాల లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

వివరాలు 

ముఖ్యమైన ఫీచర్లు: 

మ్యాటర్ ఎరా బైక్‌లో 7 అంగుళాల స్మార్ట్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇందులో నావిగేషన్, రైడ్ డేటా, మ్యూజిక్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే OTA (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. బైక్‌కి డ్యూయల్ డిస్క్ బ్రేకులు, ఏబీఎస్ (ఆంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్యూయల్ సస్పెన్షన్ వంటి ఆధునిక సదుపాయాలను కూడా జోడించారు. ఇది మాత్రమే కాకుండా, కీలెస్ ఎంట్రీ, రిమోట్ లాక్ మరియు అన్‌లాక్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లను మ్యాటర్ యాప్ ద్వారా యూజర్లు యాక్సెస్ చేయవచ్చు.

వివరాలు 

పనితీరు, బ్యాటరీ వివరాలు: 

ఈ బైక్‌లో శక్తివంతమైన మోటార్,బ్యాటరీను సంస్థ అమర్చింది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ బ్యాటరీకి IP67 సర్టిఫికేషన్ ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ఈ బైక్ గరిష్ఠంగా 172 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. వేగ పరంగా చూస్తే, 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో చేరుకుంటుంది. అలాగే, ఈ బైక్‌లో నాలుగు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కూడా ఉంది, ఇది ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో అరుదైన అంశం.