Page Loader
2024 Yamaha MT-09: మార్కెట్లోకి త్వరలో మయహా ఎంటీ 09.. 890 సీసీ పవర్ ఫుల్ ఇంజన్‌తో రాక!
మార్కెట్లోకి త్వరలో మయహా ఎంటీ 09.. 890 సీసీ పవర్ ఫుల్ ఇంజన్‌తో రాక!

2024 Yamaha MT-09: మార్కెట్లోకి త్వరలో మయహా ఎంటీ 09.. 890 సీసీ పవర్ ఫుల్ ఇంజన్‌తో రాక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ మార్కెట్లోకి యమహా ఎంటీ 09 త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇండియాలో కొత్త మోటార్ సైకిల్ విడుదల సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. త్వరలోనే భారత్‌లో తమ ప్రీమియం బ్రాండ్ బైక్స్‌ను తీసుకొస్తున్నట్లు యమహా స్పష్టం చేసింది. త్వరలో యమహా R3, యమహా ఎంటీ-03 బైక్స్ భారత్‌లో లాంచ్ కానున్నాయి. వచ్చే ఏడాది మయహా ఎంటీ 07ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బైకును మరింత స్టైలిష్‌గా రూపొందించారు. హెడ్ ల్యాంప్ యూనిట్, రెండు LED డే టేమ్ రన్నింగ్ ల్యాంప్ లను కూడా ఏర్పాటు చేశారు.

Details

యమహా ఎంటీ 07లో అధునాతన ఫీచర్లు

LED టర్న్ ఇండికేటర్లు, బైక్ టర్న్ కాగానే, ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌‌తో టైప్-సి చార్జింగ్ సాకెట్‌ కూడా ఉంది. యమహా రైడ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌ సదుపాయాలతో పాటు ఈ బైకులో ఐదు రైడింగ్ మోడ్‌లున్నాయి. ఈ బైక్ ఇంజిన్‌లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ఇది 10,000 ఆర్పీఎం వద్ద 117.3 బీహెచ్పీ పవర్ ను, 7,000 ఆర్పీఎం వద్ద 93 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్ యూనిట్ వస్తుంది.