Page Loader
Mercedes-Benz : ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు! ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు!

Mercedes-Benz : ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెర్సిడేస్ బెంజ్ నుంచి కొత్తగా ఓ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. మెర్సిడేస్ ఎంఎంజీ 63ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. తుఫాన్ వేగంలో ఈ వెహికల్ దూసుకుపోతుందని సంస్థ చెబుతోంది. మెర్సిడేస్ ఎంఎజీ 63 ధర రూ. 4 కోట్లు ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,000 యూనిట్ల ఉత్పత్తిలో కేవలం 25 యూనిట్లు మాత్రమే ఇండియాకు కేటాయించారు. ఇప్పటికే Mercedes-Maybach, Mercedes-AMG లేదా S-క్లాస్ యజమాని అయితే మాత్రమే మీరు ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మొదటిసారిగా కలహరి గోల్డ్ మాగ్నోలో AMG లోగో, మెర్సిడెస్ స్టార్‌ను ప్రదర్శించనుంది. అఫాల్టర్‌బాచ్ చిహ్నం బానెట్‌పై స్పష్టంగా కనిపించనుంది.

Details

4.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం

ఇందులో అదనంగా ముందువైపు ఆప్టికల్ అండర్‌రైడ్ రక్షణ, స్పేర్ వీల్ ఇన్‌లేలో మెర్సిడెస్ స్టార్, స్పేర్ వీల్ రింగ్ ఉన్నాయి. AMG G 63 గ్రాండ్ ఎడిషన్‌లో 22-అంగుళాల AMG ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌పై క్రాస్-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంది.ఇది టెక్ గోల్డ్ ఫినిషింగ్‌లో రానుంది. మ్యాట్ బ్లాక్ సెంట్రల్ లాకింగ్ నట్‌‌తో పాటు చక్రాలపై ఉన్న మెర్సిడెస్ స్టార్ కూడా బంగారం పూతతో ఉండనుంది. క్యాబిన్ లోపల బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్ ను ఆకర్షణీయంగా అమర్చారు. ఫ్లోర్ మ్యాట్‌లు కాంట్రాస్ట్ గోల్డ్ స్టిచింగ్‌తో నలుపు రంగులో ఉండనున్నాయి. ఈ వెహికల్ 4.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 220 కి.మీ ప్రయాణించగలదు.