భారత్ మార్కెట్లోకి మెర్సిడెస్-బెంజ్ EQE.. ధర ఫీచర్ల వివరాలివే!
జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత్ మార్కెట్లోకి ఇప్పటికే రెండు స్పోర్ట్స్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేసింది. ఇప్పటికే ఈ రెండు కార్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో భారత్ మార్కెట్లోకి నేడు తన మూడవ ఎలక్ట్రిక్ కారు అయిన మెర్సిడెస్-బెంజ్ EQE విడుదల చేసింది. ఎలక్ట్రిక్ లగ్జరీ SUV సెగ్మెంట్‌లో ఆడి క్యూ8 ఇ-ట్రాన్, బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ వంటి వాహనాలను ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. గతంలో మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ EQS, మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ EQB విడుదల చేసిన తర్వాత మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ EQE తన మూడవ ఈవీగా మార్కెట్లోకి రానుంది.
మూడోవ ఎస్‌యూవీగా వస్తున్న మెర్సిడేజ్-బెంజ్ EQE
మెర్సిడెస్-బెంజ్ ఎస్‌యూవీ EQE లో క్యాబిన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ కన్సోల్‌తో కొత్S-క్లాస్-ప్రేరేపిత పోర్ట్రెయిట్-ఓరియెంటెడ్ స్క్రీన్‌తో రానుంది. 1,410 mm-వెడల్పు ప్యానెల్ కింద మూడు వ్యక్తిగత డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలు సరికొత్త MBUX OS ద్వారా అందించబడతాయి, ఇది వాయిస్ కమాండ్, రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్, OTA అప్‌డేట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. విశాలవంతమైన క్యాబిన్‌తో పాటు లోపల ఐదు సీట్లు ఉండనున్నాయి. Mercedes-Benz వచ్చే మూడేళ్లలో భారతదేశంలో 25శాతం కార్ల విక్రయాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మెర్సిడేజ్-బెంజ్ EQE ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.40 కోట్లు ఉండనుంది.