Page Loader
Mercedes-Benz: ఈ ఏడాది ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లు విడుదల 
ఈ ఏడాది ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లు విడుదల

Mercedes-Benz: ఈ ఏడాది ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లు విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం అయిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా 2025 సంవత్సరంలో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వీటిలో కొన్ని బ్యాటరీ ఆధారిత మోడళ్లు కూడా ఉంటాయని సంస్థ పేర్కొంది. గత సంవత్సరం 14 కొత్త మోడళ్లను పరిచయం చేసినట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. 2025 సంవత్సరాన్ని 2,000 యూనిట్లతో ప్రారంభించి, ఈ ప్రస్థానం సంస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉందని ఆయన చెప్పారు. కంపెనీ మొత్తం విక్రయాలలో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రుణం సమకూర్చిందని తెలిపారు. ఇప్పటివరకు కస్టమర్లకు రూ. 10,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

వివరాలు 

రెండు కొత్త మోడళ్లు.. 

ఈ క్రమంలో, మెర్సిడెస్‌ ఇండియా రెండు కొత్త బ్యాటరీ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇవి ఈక్యూ టెక్నాలజీతో జీ580, అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్‌ ఎస్‌యూవీ 450. జీ580 ఎక్స్‌షోరూంలో రూ. 3 కోట్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది, ఇది ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈక్యూఎస్‌ ఎస్‌యూవీ 450 ధర రూ. 1.28 కోట్లు, మరియు ఇది భారతదేశంలో మొబిలిటీ షోలో మెర్సిడెస్‌ మైబహ్‌ ఈక్యూఎస్‌ ఎస్‌యూవీ నైట్‌ సిరీస్‌తో కలిసి ప్రదర్శించబడింది.

వివరాలు 

రెండింతలైన ఈవీలు.. 

2024లో,సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది,ఇది 2023తో పోలిస్తే 12.4 శాతం పెరిగింది. బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాల (EVs) అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు. మొత్తం అమ్మకాల్లో EVs వాటా ఏడాది క్రితం 2.5 శాతంగా ఉండగా,2024లో అది 6శాతానికి పెరిగింది. అదేవిధంగా,రూ. 1.5 కోట్ల విలువైన టాప్‌ ఎండ్‌ కార్ల అమ్మకాలు 30శాతంగా పెరిగాయి. ప్రస్తుతం సంస్థ 50 నగరాల్లో 125 ఔట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది,ఈ ఏడాది 20 కొత్త లగ్జరీ కేంద్రాలు ప్రారంభించబోతుందని చెప్పారు. ఫ్రాంచైజ్‌ భాగస్వాములు గత 3సంవత్సరాల్లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. భారత్‌లో మొదటి రెండు దశాబ్దాల్లో 50,000పైచిలుకు మెర్సిడెస్‌ కార్లు రోడ్డెక్కగా,గత 10సంవత్సరాల్లో 1.5లక్షల యూనిట్లు కస్టమర్లకు చేరుకున్నట్లు వివరించారు.