MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది
బ్రిటిష్ తయారీసంస్థ MG మోటార్ ఏప్రిల్‌లో భారతదేశంలో తమ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 10 లక్షలు ధరతో, మార్కెట్లో ఇది టాటా టియాగో ఎలక్ట్రిక్ వాహనంతో తో పోటీపడుతుంది. టాటా టియాగో EV 19.2kWh బ్యాటరీ ప్యాక్‌తో లేదా 24kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయిన మోటార్‌తో నడుస్తుంది. 19.2kWh బ్యాటరీ 250 కిమీ, 24kWh బ్యాటరీ 315 కిమీ వరకు నడుస్తుంది. MG కామెట్ EV 17.3kWh బ్యాటరీ, 26.7kWh యూనిట్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. 17.3kWh బ్యాటరీ 200 కిమీ, 26.7kWh బ్యాటరీ 300 కిమీల వరకు నడుస్తుంది.
రెండింటిలో టాటా టియాగో EV మెరుగైన ఆప్షన్
టాటా టియాగో EVలో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్ ఉంది. MG కామెట్ EV డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, పవర్ విండోస్, మాన్యువల్ AC, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నాలుగు-సీట్ల క్యాబిన్ ఉంటుంది. భారతదేశంలో, టాటా టియాగో EV ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 11.99 లక్షలు, MG కామెట్ EV ధర సుమారుగా రూ. 10 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). టాటా టియాగో EV విశాలమైన క్యాబిన్ తో, తక్కువ ధరతో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.