MG Hector: ఎంజీ హెక్టార్‌లో బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్లు.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టార్ ఎస్‌యూవీకి రెండు కొత్త స్పెషల్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ పేర్లతో విడుదలైన ఈ రెండు ఎడిషన్ల ఎక్స్-షోరూమ్ ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది. టాప్-స్పెసిఫికేషన్ సావీ ప్రో సీవీటీతో పోలిస్తే ఈ కొత్త ఎడిషన్లు రూ.35,000 అధిక ధరతో వస్తాయి. ఈ రెండు స్పెషల్ ఎడిషన్లు 5-సీటర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
వివరాలు
నలుపు రంగులో బ్లాక్‌స్టార్మ్
పేరు సూచించినట్లుగానే బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో పూర్తిగా నలుపు రంగు థీమ్‌ను అందించారు. డార్క్ క్రోమ్ బ్యాడ్జింగ్, పియానో బ్లాక్ రూఫ్ రైల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఈ ఎడిషన్‌కు ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాయి.
వైట్ బాడీ.. బ్లాక్ రూఫ్‌తో స్నోస్టార్మ్
స్నోస్టార్మ్ ఎడిషన్‌లో పెర్ల్ వైట్ బాడీతో పాటు స్టార్ బ్లాక్ రూఫ్‌ను అందించారు. రెండు ఎడిషన్లలోనూ స్టార్మ్ హెక్స్ గ్రిల్, బ్లాక్ హెడ్‌ల్యాంప్ బెజెల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి.
వివరాలు
డార్క్ క్యాబిన్.. ప్రీమియం ఫీచర్లు
ఇంటీరియర్‌లో రెండు ఎడిషన్లకు డార్క్ క్యాబిన్ థీమ్ ఇచ్చారు. బ్లాక్ లెదర్ సీట్లతో పాటు ముందు హెడ్‌రెస్టులపై ఆయా ఎడిషన్ పేర్లను ఎంబాస్ చేశారు.
వీటితో పాటు 8 రంగుల్లో పనిచేసే యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టెక్నాలజీ పరంగా 35.56 సెం.మీ పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్, 17.78 సెం.మీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.
ఎంజీ ఐ-స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా 70కి పైగా ఫీచర్లను వినియోగించుకోవచ్చు.
వివరాలు
భద్రతకు అధునాతన ఫీచర్లు
సేఫ్టీ విషయంలోనూ హెక్టార్ స్పెషల్ ఎడిషన్లలో పలు ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, బ్రేక్ అసిస్ట్‌తో పాటు ఏడీఏఎస్‌ను అందించారు.
యాక్సెసరీ ప్యాక్.. ఫైనాన్స్ సదుపాయాలు
డీలర్‌షిప్‌ల వద్ద ప్రత్యేకంగా స్టార్మ్ యాక్సెసరీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుందని ఎంజీ మోటార్ తెలిపింది.
కొనుగోలుదారులకు 84 నెలల వరకు 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అదే విధంగా ఎంజీ షీల్డ్ ప్యాకేజీలో భాగంగా మూడు సంవత్సరాల వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు ఉచిత సర్వీసులను అందిస్తోంది.