Page Loader
MG ZS EV: ఎంజీ మోటార్‌ భారీ ఆఫర్‌.. జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.4.4 లక్షల డిస్కౌంట్‌!
ఎంజీ మోటార్‌ భారీ ఆఫర్‌.. జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.4.4 లక్షల డిస్కౌంట్‌!

MG ZS EV: ఎంజీ మోటార్‌ భారీ ఆఫర్‌.. జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.4.4 లక్షల డిస్కౌంట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియాలోకి ప్రవేశించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించింది. ప్రత్యేకించి తమ తొలి ఈవీ మోడల్‌ అయిన ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.4.44 లక్షల వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Details

వేరియంట్ల వారీగా ధరలు ఇలా ఉన్నాయి 

ఎగ్జిక్యూటివ్‌ వేరియంట్‌: రూ.13,000 తగ్గింపు పొందుతూ రూ.16.88 లక్షల నుంచి రూ.16.75 లక్షలకు తగ్గింది. ఎక్సైట్‌ ప్రో వేరియంట్‌: రూ.48,000 డిస్కౌంట్‌తో రూ.18.97 లక్షలకున్న ధర ఇప్పుడు రూ.18.49 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). ఎక్స్‌క్లూజివ్‌ ప్లస్‌ వేరియంట్‌: రూ.23.64 లక్షలకున్న ఈ వేరియంట్‌ ప్రస్తుతం రూ.19.49 లక్షలకే లభిస్తుంది. ఎసెన్స్‌ వేరియంట్‌ (టాప్-ఎండ్‌): ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.24.93 లక్షలు ఉండగా, ఇది ఇప్పుడు రూ.20.49 లక్షలకే అందుతోంది. అంటే రూ.4.44 లక్షల తగ్గింపు.

Details

ఒకే ఛార్జ్ లో 461 కిలోమీటర్లు ప్రయాణం

ఎంజీ మోటార్‌ ప్రవేశపెట్టిన తొలి ఎలక్ట్రిక్ వాహనం జెడ్‌ఎస్‌ ఈవీ, టాటా కర్వ్‌.ఈవీ, హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, మహీంద్రా బీఈ6 వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తోంది. ఇది 50.3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో లభించడంతో ఒకే ఛార్జ్‌లో 461 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ ప్రత్యేక ఆఫర్‌తో ఎంజీ మోటార్‌ ఈవీ మార్కెట్లో తన పోటీదారులకు గట్టి సవాల్‌ విసిరినట్లయ్యింది.