Loading...
MG Windsor EV Facelift: 449 కిమీ రేంజ్‌తో ఎంజీ విండ్సర్‌ ఈవీ... భారీ బ్యాటరీ సౌకర్యం..లాంచ్‌ ఎప్పుడంటే
449 కిమీ రేంజ్‌తో ఎంజీ విండ్సర్‌ ఈవీ... భారీ బ్యాటరీ సౌకర్యం..లాంచ్‌ ఎప్పుడంటే

MG Windsor EV Facelift: 449 కిమీ రేంజ్‌తో ఎంజీ విండ్సర్‌ ఈవీ... భారీ బ్యాటరీ సౌకర్యం..లాంచ్‌ ఎప్పుడంటే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 23, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న MG Windsor EVకి కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి బ్యాటరీ సామర్థ్యాన్ని 61kWhకు పెంచే అవకాశం ఉండటంతో, ప్రస్తుత 449 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ లభించే అవకాశముంది. MG Motor India ఈ కొత్త మోడల్‌ను 2027లో భారత ఆటో మొబైల్‌ మార్కెట్లోకి తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ ఇప్పటివరకు లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కొత్త బ్యాటరీతో పాటు డిజైన్, ఇంటీరియర్, టెక్నాలజీలోనూ మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

Details

449 కిమీ దాటనున్న రేంజ్

ప్రస్తుతం MG Windsor EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 38kWh బ్యాటరీ 332 కిలోమీటర్ల ARAI క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుండగా, 52.9kWh బ్యాటరీ 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

కొత్త 61kWh బ్యాటరీతో ఈ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన రేంజ్‌ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

మోటార్‌ను కూడా ప్రస్తుత మోడల్ తరహాలోనే ముందు యాక్సిల్‌పై కొనసాగించే అవకాశం ఉంది.

పవర్, పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Details

డిజైన్‌లోనూ మార్పులు ఉండొచ్చు

విండ్సర్ EVలో బ్యాటరీ ఒక్కటే ప్రధాన అప్‌డేట్ కాకపోవచ్చు. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మార్చడంతో పాటు ఇంటీరియర్‌ను కూడా ఆధునీకరించే అవకాశం ఉంది.

కొత్త ఫీచర్లు, టెక్నాలజీ, మెరుగైన డ్రైవింగ్ అనుభవం వంటివి జోడించవచ్చని సమాచారం. MG Windsor EVని కంపెనీ తొలిసారి 2024లో భారత్‌లో విడుదల చేసింది.

ఆ తర్వాత 2025లో 52.9kWh బ్యాటరీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2026లో ఈ కారు అమ్మకాలు 80,000 యూనిట్లను దాటాయి.

ADVERTISEMENT

Details

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం MG Windsor EV ధర సుమారు రూ. 14.85 లక్షల నుంచి రూ.19.15 లక్షల వరకు ఉంది. కొత్త మోడల్‌లో పెద్ద బ్యాటరీ, అదనపు ఫీచర్లు చేరితే ధర కొంత పెరిగే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతానికి టెస్టింగ్ మోడల్ రోడ్లపై కనిపించకపోవడం, అధికారిక ప్రకటన లేకపోవడం వల్ల ఫేస్‌లిఫ్ట్‌లో ఉండే మార్పులపై పూర్తి స్పష్టత లేదు.

2027లో లాంచ్ అయితే Tata Nexon EV, Kia Syros EV వంటి మోడళ్లకు ఇది మరింత బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఎక్కువ రేంజ్ కోరుకునే కొనుగోలుదారుల దృష్టిని 61kWh బ్యాటరీ ఆకర్షించవచ్చు.

ADVERTISEMENT