Page Loader
MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం
MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం

MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఎస్‌యూవి కొత్త వేరియంట్ ధర రూ. 27.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1930లో స్థాపించబడిన MG మోటార్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇప్పటికే సంచలనాలను సృష్టిస్తోంది. 2019లో ZS EVతో మొదటిసారిగా ఇండియన్ మార్కెట్లోకి ఆ సంస్థ అడుగుపెట్టింది. MG ZS EV లెవల్-2లో LED హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. SUVలో మస్కులర్ బానెట్, ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ పోర్ట్‌తో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, డిజైనర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Details

MG ZS EV లెవల్-2లో ఆరు ఎయిర్ బ్యాగులు

ఈ వెహికల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఆ సంస్థ స్పష్టం చేసింది.ప్రయాణీకుల భద్రత ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో ఉండనున్నాయి. అప్హోల్స్టరీ, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్ట్ చేయబడిన కార్ ఫంక్షన్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 7.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, యాపిల్ కార్ ప్లే, Android Autoతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ను పొందుతుంది. ఈ వెహికల్‌ని గరిష్టంగా 173hp శక్తిని, 280Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఈ ఎస్ యూవీ కోసం మార్కెట్లో ఎక్కువ పోటీ ఉంది.