Tesla: టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని ఏ ఆటోమేకర్ ఉపయోగించకూడదు: మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా CEO ఎలాన్ మస్క్ పెద్ద కంపెనీలకు తమ స్వీయ నియంత్రిత డ్రైవింగ్ టెక్నాలజీ (FSD)ని లైసెన్స్‌గా ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా, ఏ ఆటోమొబైల్ కంపెనీ కూడా ఆ ఆసక్తి చూపడం లేదని ఆయన అంగీకరించారు. "వారిని ముందే హెచ్చరించాను, అలాగే టెస్లా FSDను లైసెన్స్‌గా ఇస్తామన్నా... ఎవ్వరూ తీసుకోవాలని అనుకోవడం లేదు! ఆశ్చర్యం" అని మస్క్ X లో పోస్ట్ చేశారు. ఇది మస్క్ ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధం. గతంలో ఆయన, సంప్రదాయ కార్ కంపెనీలు తప్పనిసరిగా టెస్లా FSD వాడాల్సిందేనని భావించేవారు. 2021 ప్రారంభంలోనే మస్క్, FSD సాఫ్ట్‌వేర్‌ను లైసెన్స్‌గా ఇవ్వాలన్న విషయంపై కొన్ని కంపెనీలతో చర్చలు జరిగాయని చెప్పాడు.
వివరాలు
వేమో చాలా మెరుగ్గా పనిచేస్తుంది
2023లో కూడా టెస్లా టెక్నాలజీని ఇతర కంపెనీలకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని పలుమార్లు ట్వీట్ చేశారు. 2024 ఏప్రిల్‌లో ఒక పెద్ద ఆటోమేకర్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో, ఏదైనా ఒప్పందం కుదిరే అవకాశాలు అప్పట్లో ఎక్కువయ్యాయి. కానీ ఫోర్డ్ CEO జిమ్ ఫార్లీ మాత్రం టెస్లా FSD టెక్నాలజీ తమకు ఉపయోగం లేదని స్పష్టంగా చెప్పారు. "వేమో చాలా మెరుగ్గా పనిచేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో, టెస్లా—ఫోర్డ్ మధ్య జరుగుతున్నట్లు భావించిన లైసెన్సింగ్ చర్చలు ఎందుకు ఫలించలేదో కూడా బయటపడింది. తాజాగా మస్క్, ఇతర కంపెనీలతో చర్చలు నిలిచిపోయింది అని వెల్లడించారు.
వివరాలు
కంపెనీలు కోరిన నిబందనలు టెస్లాకు ఈ దశలో అమలు చేయలేనివని స్పష్టమైంది
"పాత ఆటో కంపెనీలు ఏదైనా మాట్లాడతాయంటే... ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం FSD పెట్టాలనుకుంటారు, అది కూడా టెస్లాకు సాధ్యం కాని షరతులతో" అని ఆయన X లో రాశారు. దీంతో ఆ కంపెనీలు కోరిన నిబందనలు టెస్లాకు ఈ దశలో అమలు చేయలేనివని స్పష్టమైంది. ఇక టెస్లా మాత్రం తమ FSD సిస్టమ్‌ను 'ఆగ్రెసివ్'గా వినియోగదారుల వద్దకు తీసుకెళ్లే విధానాన్నే కొనసాగిస్తోంది. బీటా వెర్షన్‌గా (ఇప్పుడు "Supervised" అని పేరు మార్చారు) కస్టమర్లకు ఇచ్చి,ఆ సిస్టమ్‌ని వాలిడేట్ చేసుకునే విధానం టెస్లా అనుసరిస్తోంది.
వివరాలు
ఫెడరల్ దర్యాప్తులు,కోర్టు కేసులు
అయితే ఈ విధానం కారణంగా ఫెడరల్ దర్యాప్తులు, కోర్టు కేసులు కూడా ఎదురయ్యాయి. ఈ నెలలోనే ఒక Model Y వాహనం ఆటోపైలట్‌లో ఉండగా నిలిచివున్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కేసును టెస్లా కోర్టు బయట పరిష్కరించుకుంది. ఈ కేసు విచారణలోకి వెళ్లి జ్యూరీ తీర్పు రావడం తప్పించుకున్నా, టెస్లా టెక్‌కు ఉన్న రిస్క్‌లు ఒక్కసారి మరోసారి వెలుగులోకి వచ్చాయి.