2025 BMW C 400 GT: దేశీయ మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర రూ.11 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ కార్ల తయారీదారు బి ఎం డబ్ల్యూ (BMW) అనుబంధ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా దేశీయ మార్కెట్లో కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.
తాజా సాంకేతికతతో అభివృద్ధి చేసిన 2025 బీఎండబ్ల్యూ సీ400 జీటీ (BMW C 400 GT) మోడల్‌ను విడుదల చేసింది.
దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.11 లక్షలుగా నిర్ణయించింది. భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన స్కూటర్లలో ఇది ఒకటి.
గత మోడల్‌తో పోలిస్తే, కొత్త ఫీచర్లు జోడించి మరింత అధునాతనంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
2025 బీఎండబ్ల్యూ సీ400 జీటీ ప్రత్యేకతలు
ఇంజిన్ & పనితీరు:
350 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7,500 rpm వద్ద 34hp పవర్, 5,750rpm వద్ద 35Nm టార్క్ గరిష్ఠ వేగం గంటకు 129 కిలోమీటర్లు
డిజైన్ & స్టోరేజ్:
స్కూటర్ ముందు భాగంలో 4.5 లీటర్ల స్టోరేజ్ స్పేస్ సీటు కింద 37.6లీటర్ల అదనపు నిల్వ స్థలం
డిస్‌ప్లే & కనెక్టివిటీ:
10.25-అంగుళాల TFT డిస్‌ప్లే నావిగేషన్, మీడియా, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయాలు ఎడమ వైపు కంపార్ట్‌మెంట్‌లో యూఎస్‌బీ టైప్-సి, 12V ఛార్జింగ్ పోర్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను సరిగా ఛార్జ్ చేయగలిగే అవకాశం
భద్రతా ఫీచర్లు:
లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్టెన్స్ డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఏబీఎస్ (ABS)సిస్టమ్ సీవీటీ (CVT) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్
వివరాలు
స్టైలిష్ డిజైన్
అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, స్టైలిష్ డిజైన్ కలిగిన 2025 బీఎండబ్ల్యూ సీ400 జీటీ స్కూటర్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించబడింది.