
కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కేటీఎం ఇటీవల 990 ఎస్ఎంటీ బైక్ సక్సెసర్‌ను ఇటీవల లాంచ్ చేసింది.
దీని పేరు కేటీఎం 890 ఎస్ ఎంటీ సూపర్ మోటో.. ఈసూపర్ మోటో టూరర్ ఇండియాలో లాంచ్ చేయకపోవచ్చు. ఈ బైక్లో ఉన్న అట్రాక్టివ్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం..
కేటీఎం ఇటీవలే 890 ఎస్ఎంటీని ఆవిష్కరించింది. ఇది సూపర్ మోటో టూరర్ కిందకు రానుంది.
ఈ స్ట్రైలిస్ బైక్ లో 17 ఇంచ్ వీల్స్, వైడ్ హ్యాండిల్ బార్, స్పేషియస్ సీట్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది.
ఈ బైక్లో 890 సీసీప్యారెలల్ ట్విన్ ఇంజిన్ ఉండనుంది. ఇది 105 హెచ్‌పీ పవర్‌ను, 100 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది.
Details
ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్ల ప్రయాణం
ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉండడం విశేషం. ఈ 890 ఎస్ఎంటీలో డబ్య్లూపీ ఎపెక్స్ 43 ఎంఎం ఫ్రెంట్ సస్పెన్షన్, రేర్ లో డబ్య్లూపీ అపెక్స్ మోనోషాక్ ఉండనున్నాయి.
ఈ బైక్ లో 320 ఎంఎం ఫ్రెంట్ డిస్క్స్, 260 ఎంఎం రేర్ డిస్క్ లు ఉండడం ప్రత్యేకత.
15.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ దీని సొంతం. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే అవకాశం ఉంటుంది.