టీవీఎస్ నుంచి కొత్త బైక్ లాంచ్.. ఆ కొత్త మోడల్ పేరు ఇదే!
కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ నుంచి ఓ కొత్త బైక్ విడుదల చేయడానికి ట్రేడ్ మార్క్ దాఖలు చేసింది. టీవీఎస్ కంపెనీ 'అపాచీ ఆర్‌టీఎక్స్' అనే నేమ్ ప్లేట్ ను ట్రేడ్ మార్క్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అపాచీ నుంచి 160 సీసీ, 180 సీసీ, 200 సీసీ, 310 సీసీ బైకుల్లో మార్కెట్లో ఉన్నాయి. కాగా ఈ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్ ను తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. దీంతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ లాంచ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఆర్ టీఆర్ తో పోల్చుకుంటే ఆర్ టీఎక్స్ పేరు కొత్తగా ఉంది.
అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్ కు భారీ డిమాండ్
అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్ కు ఈ మధ్య కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. కస్టమర్లు వీటిని ఆల్ ఇన్ వన్ బైక్స్ గా భావిస్తున్నారు. ఈ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ లాంచ్, ఫీచర్స్, వంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు. అపాచీ ఆర్‌టీఎక్స్‌తో పాటు సరికొత్త క్రూజ్ మోటర్ సైకిల్ డిజైన్ కోసం పేటెంట్ కోసం టీవీఎస్ అప్లై చేసింది. ఇందులో కన్వెన్షనల్ క్రూజ్ డిజైన్, సర్క్యులర్ హెడ్ల్యాంప్, వైడ్- టాల్ హ్యాండిల్బార్, వైడ్ ఫ్యూయెల్ ట్యాంక్ వంటివి రానున్నాయి. ఇందులో 310సీసీ ఇంజిన్ ఉండే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చే నెలలో దీని గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.