Honda Acura ZDX EV : హోండా నుంచి కొత్త ఈవీ..10 నిమిషాల ఛార్జ్‌తో 130 కిలోమీటర్ల ప్రయాణం
జపనీస్ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఈవీని తీసుకొస్తోంది. లగ్జరీ వాహనాల యూనిట్ అకురా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం విశేషం. టెస్లా, ఫోర్డ్ వంటి దిగ్గజ సంస్థలకు పోటినిచ్చే విధంగా అకురా జెడ్‌డీఎక్స్ ఈవీ తీర్చిద్దారు. ఈ ఈవీకి సంబంధించి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అకురా జెడ్‌డీఎక్స్ 2024లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీని బేస్ ప్రైజ్ ధర 60వేల డాలర్లు ఉండగా, ఇండియన్ కరెన్సీలో సూమారు 50 లక్షలు ఉండనుంది. లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ వాహనానికి మంచి డిమాండ్ లభిస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి.
హోండా అకురా జెడ్‌డీఎక్స్ లో అధునాతన ఫీచర్లు
రేర్ పెడిస్ట్రియన్ అలర్ట్, హ్యాండ్స్ ఫ్రీ క్రూజ్ డ్రైవర్ అసిస్టెన్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ప్రీమియం బాంగ్ అండ్ ఓలుఫ్ సెన్ ఆడియో సిస్టెమ్ వంటివి ఈ ఈవీలో ప్రత్యేకంగా అమర్చారు. ఈ వెహికల్ బ్యాటరీని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే, ఏకంగా 130 కిలోమీటర్లు ప్రయాణించగలదని సమాచారం. ఈ లగ్జరీ వెహికల్‌తో అమెరికాలో విప్లవం సృష్టించాలని హోండా భావిస్తోంది. 2024 తొలినాళ్లలో దీని డెలివరీలు మొదలు పెట్టి, అంతకన్నా ముందుగానే 30వేలకు పైగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సెటప్ చేయాలని ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది.