
Renault: రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ తాజాగా సినీక్ ఈ-టెక్ ఈవీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఈవీని సీఎంఎఫ్-ఈవీ ఫ్లాట్ ఫాంపై రూపొందించనుంది.
మెగేన్ ఈ టెక్, నిస్సాన్ ఆరియా వంటి ప్రముఖ మోడల్స్ ని కూడా ఇదే ప్లాట్ ఫాంపై తయారు చేయడం విశేషం.
ఈ నేపథ్యంలో ఈ కొత్త ఈవీ విశేషాల గురించి తెలుసుకుందాం. రెనాల్ట్ సీనిక్ ఈటెక్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో ఫ్లాట్ ఫోర్, లార్బే పానోరమిక్ సన్రూఫ్, 545 లీటర్ల్ బూట్ స్పేస్ వంటివి రానున్నాయి.
ఇందులో 8.7 లీటర్ స్టోరజ్ కెపాసిటీతో ముందుకు వస్తోంది. ప్రధానంలో ఇందులో ఆర్మ్ రెస్ట్, ఫోల్డ్-ఔట్ స్టాండ్స్, డ్రింక్స్ హోల్డర్స్, టైప్-సీ ఔట్ లైట్స్ ఉండనున్నాయి.
Details
రెనాల్ట్ సినీక్ ఈ టెక్ ఈవీలో రెండు వేరియంట్లు
ఈ కొత్త ఈవీలో ఓపెన్ ఆర్ లింక్ డిజిటల్ కాక్‌పిట్‌లో 12.3 ఇంచ్ హారిజాంటల్ టీఎఫ్‌టీ స్క్రీన్ ఉండనుంది. ఇందులో 50పైగా యాప్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సరికొత్త ఈవీ మోడల్‌లో రెండు వేరియంట్లు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ కాగా, రెండోది హై గా ఉంది. స్టాండర్ట్ వేరియంట్‌లో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోటర్ ఉండగా, ఇది 170 హెచ్‌పీ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేయనుంది. దీని రేంజ్ 418 కి.మీలనీ సంస్థ వెల్లడించింది.
రెండో వైరియంట్ హైలో 220 హెచ్‌పీ పవర్‌ను, 300 ఎన్ఎం జనరేట్ చేసే మోటర్ ఉంది. దీని రేంజ్ 620కి.మీలని సంస్థ స్పష్టం చేసింది.