Fast Tag: నేటి నుండి ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమలులోకి.. ఇవి చెక్ చేసుకోకపోతే భారీగా ఫైన్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) లావాదేవీలకు సంబంధించి రెండు కొత్త మార్పులను అమల్లోకి తీసుకువచ్చాయి.
టోల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. ఇవి ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త మార్పులు ఏమిటి?
తక్కువ బ్యాలెన్స్, ఆలస్యం లేదా బ్లాక్‌లిస్ట్ అయిన FASTagలపై పెనాల్టీ
వాహనదారుల ఫాస్ట్‌ట్యాగ్‌లో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే, టోల్ చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురవుతాయి.
అలాంటి పరిస్థితిలో వారు జరిమానా (పెనాల్టీ) చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్ట్‌ట్యాగ్ పనిచేస్తుందా లేదా? అందులో సరిపడా బ్యాలెన్స్ ఉందా? అన్నివేళలా చెక్ చేసుకోవడం అవసరం.
వివరాలు
బ్యాలెన్స్ లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లోకి మార్పు
ఫాస్ట్‌ట్యాగ్‌లో సరిపడా బ్యాలెన్స్ లేకుంటే, అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తుంది.
టోల్ ప్లాజా వద్ద చేరుకునే సమయానికి ఒక గంట (60 నిమిషాల) లేదా అంతకంటే ఎక్కువ సమయం ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి.
టోల్ స్కానింగ్ చేసిన 10 నిమిషాల తరువాత ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌గా మారితే కూడా లావాదేవీ తిరస్కరించబడుతుంది.
లావాదేవీ రద్దయిన వాహనదారుడు రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
బ్లాక్‌లిస్ట్ నుంచి ఎలా బయటపడాలి?
ఫాస్ట్‌ట్యాగ్ సక్రమంగా పనిచేయడానికి తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. కేవలం బ్యాలెన్స్ మాత్రమే కాదు, KYC డాక్యుమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
ప్రయాణం మొదలుపెట్టే ముందు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. టోల్ ప్లాజా వద్దకు చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ అప్‌డేట్ చేయడం అవసరం.
ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల గణాంకాలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నవంబర్ 2024లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల విలువ రూ. 6,070 కోట్లు. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య రూ. 6,642 కోట్లకు చేరుకుంది. 2025లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.