Page Loader
మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్

మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 11, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

లెజెండరీ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ మార్చి 16న కొత్త సూపర్‌కార్‌ను ఆవిష్కరించనుంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ కార్ గురించి చిన్న టీజర్‌ను విడుదల చేసింది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ల తయారీదారులలో ఒకటైన ఫెరారీ V8, V12-తో పనిచేసే సూపర్ కార్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. ముందులా కాకుండా, కంపెనీ ఇప్పుడు దాని ప్రజాదరణను పెంచుకోవడానికి ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్/వేరియంట్‌లను రూపొందించడంపై దృష్టి సారించింది. బ్రాండ్ ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోకు కొత్త రోడ్‌స్టర్ మోడల్‌ను చేర్చింది. ఫెరారీ ట్విట్టర్ పోస్ట్‌లో ఈ కార్ ను ఉద్దేశించి "సమ్ థింగ్ స్పెషల్" అని ట్యాగ్ చేసింది.

కార్

ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం 360-డిగ్రీ-వ్యూ కెమెరా సిస్టమ్

ఈ సూపర్ కారు ఓపెన్-టాప్ అనుభవాన్ని అందిస్తుంది. టీజర్ వీడియోలో ఎక్కువగా చూపించకపోయినా, రాబోయే ఫెరారీ రోమా రోడ్‌స్టర్ వెర్షన్ లేదా SF90 స్పైడర్ మెరుగైన పనితీరుతో వస్తుంది. లోపల డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్‌లు, సెంటర్ కన్సోల్‌, విలాసవంతమైన క్యాబిన్, క్యాబిన్ చుట్టూ ఎక్స్‌పోజ్డ్ కార్బన్ ఫైబర్ ట్రిమ్‌లు, రెండు రేసింగ్-టైప్ బకెట్ సీట్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉండచ్చు. ప్రయాణికుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ-వ్యూ కెమెరా సిస్టమ్ ఉంటుంది. రాబోయే ఫెరారీ సూపర్‌కార్ సాంకేతిక వివరాలను వాహన తయారీసంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే రోడ్‌స్టర్ రోమా టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో నడిచే అవకాశం ఉంది.