Page Loader
MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?
పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?

MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్స్ తమ ఆస్టర్‌ లైనప్‌‌ను అప్‌డేట్ చేసింది. తాజా మార్పుల్లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అనే ఆకర్షణీయమైన ఫీచర్‌ను ఈ కారులో చేర్చారు. అదనంగా 6-స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవైపు ఈ కారు టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్‌లో నిలిపివేసింది. 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. దీనికి మాన్యువల్‌, CVT ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Details

కొత్త వేరియంట్లలో అదనపు ఫీచర్లు

ఎంజీ ఆస్టర్‌ స్ప్రింట్‌, షైన్‌ వేరియంట్లలో కొన్ని కొత్త ఫీచర్లను అందించనుంది. అస్టర్‌ ప్రామాణిక మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, లెదర్‌ సీట్లు లాంటి అధునాతన భద్రతా, సౌకర్య వసతులను కలిగి ఉంది. ఎంజీ మోటార్స్‌ ప్రకారం రూ. 12.5 లక్షల పరిధిలో ఇన్ని అధునాతన ఫీచర్లతో అందించనున్న మరో ఎస్‌యూవీ మోడల్‌ లేదని పేర్కొన్నారు. 2025 మోడల్ ఎంజీ ఆస్టర్‌లో అదనంగా వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, i-స్మార్ట్‌ 2.0 కనెక్ట్‌డ్‌ కార్‌ టెక్నాలజీ, పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌ లాంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

Details

రూ.10 లక్షల నుండి ప్రారంభం

ఎంజీ ఆస్టర్‌ బేస్‌ మోడల్‌ ధర రూ. 10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వెర్షన్ రూ. 17.5 లక్షల వరకు ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఎంజీ ఆస్టర్‌కు గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా MG ZS EV అనే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ కూడా మార్కెట్లో లభిస్తోంది. ప్రస్తుతం ఆస్టర్‌కు డిమాండ్‌ తక్కువగా ఉన్నా, తాజా అప్‌డేట్స్‌ ప్రకారం తర్వాత భారత మార్కెట్లో ఈ కారు విలువ పెరిగే అవకాశముంది.