టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే..
సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే టాటా మోటార్స్ Nexon iCNGని తీసుకొస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్లో ఈ వాహనం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని కంపెనీ భావిస్తోంది. అధునాతన ఫీచర్స్, సామర్థ్యం, ప్రాక్టికాలిటీ కలయికగా టాటా మోటార్స్ ఈ వాహనాన్ని తీసుకొస్తోంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మొట్టమొదటి సీఎన్‌జీ వెహికల్‌గా దీనికి రూపకల్పన చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా మారుతి సుజుకి బ్రెజ్జా ఉంది. ఈ కారుకు ప్రత్యామ్నాయంగా టాటా మోటార్స్ Nexon iCNG పవర్‌ట్రెయిన్‌ని తీసుకొస్తోంది. పర్యావరణ అనుకూలంగా తయారు చేస్తున్న ఈ కారు ఎస్‌యూవీ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని కంపెనీ భావిస్తోంది.
కారు ధర ఎంతంటే?
నెక్సాన్ ఈవీ సీఎన్‌జీ మోడల్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఈ కారు కలిగి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఎస్‌యూవీల కంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. మంచి డ్రైవింగ్ అనుభవాన్ని ఇది పంచుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది. పర్యావరణ అనుకూల ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుందని టాటా మోటార్స్ భావిస్తోంది. నెక్సాన్ iCNG పెట్రోల్ కారు ధర కంటే రూ.1లక్ష తక్కువగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 8.1లక్షలుగా కంపెనీ నిర్ధారించింది. ఈ కారు అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ రాబోయే కొద్ది నెలల్లోనే ఇది విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు.