జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన
జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది. వాహన తయారీ సంస్థలు ఇతర కంపెనీలతో కలిసి ఇటువంటి కలయిక కొత్త కాదు. ఇదివరకు స్మార్ట్‌ఫోన్, గడియారాల డిజైన్ తో కార్లు మార్కెట్ లో వచ్చాయి. కానీ దీనిని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం లేదు. ఇది ఎలక్ట్రిక్ మోటార్ 2.06kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయిన 1.2-లీటర్ మూడు-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది.
ప్రయాణీకుల భద్రత కోసం ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్
Nissan కిక్స్ 327 ఎడిషన్ లో బ్లాక్-అవుట్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ హెడ్‌లైట్లు, మల్టీ-స్పోక్ వీల్స్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. కారు ఎడమ వైపున 'Nissan కిక్స్ 327 ఎడిషన్' బ్రాండింగ్, కుడి వైపున 'న్యూ బ్యాలెన్స్' లోగో ఉంటుంది. దీని పెయింట్‌వర్క్ 327 Sneakers స్వెడ్ ఫాబ్రిక్, వైట్ సోల్ లా కనిపిస్తుంది. పైన తెల్లటి లేస్‌లతో పాటు కాలర్ కూడా ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్ తో పాటు ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. దీనిని జపాన్‌లోని Nissanక్రాసింగ్‌లో ప్రదర్శిస్తున్నారు. ధర, ఇతర వివరాలు అందుబాటులో లేవు. ఆ దేశంలో 3,061,300 యెన్ (సుమారు రూ. 19.2 లక్షలు) ఉండచ్చు.