NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?
    తదుపరి వార్తా కథనం
    Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?
    నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?

    Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్(Honda Motor), నిస్సాన్‌ మోటార్ (Nissan Motor) మధ్య విలీనం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తాజా సమాచారం తెలిపింది.

    హోండా కంపెనీతో విలీనం ప్రతిపాదనలను నిస్సాన్‌ రద్దు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్టు ఆంగ్ల మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

    త్వరలో ఈ విషయంపై సమావేశమయ్యే నిస్సాన్‌ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమలో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనడానికి జపాన్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హోండామూడో అతిపెద్ద సంస్థ అయిన నిస్సాన్‌ విలీనం కోసం చర్చలు మొదలుపెట్టినట్లు గత ఏడాది ప్రకటించాయి.

    వివరాలు 

    రెండు సంస్థల మధ్య చర్చలు సాఫీగా లేదు 

    బీవైడీ (BYD)వంటి చైనాకు చెందిన వాహన సంస్థలు,అలాగే ఇతర ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు ఈ రెండు కంపెనీలు విలీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.

    అయితే,రెండు సంస్థల మధ్య పెరుగుతున్న విభేదాల కారణంగా చర్చలు సాఫీగా కొనసాగడం కష్టం అవుతున్నట్లు సమాచారం.

    హోండా, నిస్సాన్‌కు గమనించినట్లుగా, దాదాపు ఐదు రెట్లు ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన హోండా సంస్థ, తన పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా నిస్సాన్‌ ప్రగతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ విలీనం త్వరలో రద్దయ్యే అవకాశం ఉన్నట్లు జపాన్‌ మీడియా తెలిపింది. అయితే, ఈ విషయంపై ఇతర సంస్థల ప్రతినిధులు ఇంకా స్పందించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆటో మొబైల్

    Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్! ఎలక్ట్రిక్ స్కూటర్
    Mahindra XEV 7e: లాంచ్‌కు ముందే ఫోటోలు లీక్.. మహీంద్రా XEV 7e కారులో కొత్త ఫీచర్లు! మహీంద్రా
    MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్‌ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్! కార్
    Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు  ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025