Loading...
Norton Atlas GT: నార్టన్ బైక్స్‌కు భారత్‌లో పేటెంట్
నార్టన్ బైక్స్‌కు భారత్‌లో పేటెంట్

Norton Atlas GT: నార్టన్ బైక్స్‌కు భారత్‌లో పేటెంట్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ ప్రీమియం మోటార్‌ సైకిల్ బ్రాండ్ నార్టన్ భారత్‌లోకి అడుగుపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీవీఎస్ యాజమాన్యంలోని ఈ సంస్థకు చెందిన Atlas GT టూరర్, Manx R సూపర్‌స్పోర్ట్ బైక్స్‌కు భారత్‌లో డిజైన్ పేటెంట్ లభించింది. వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో వీటిని తీసుకొచ్చే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే నార్టన్ ఇప్పటివరకు లాంచ్‌పై అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా ఒక మోడల్‌ను నిర్దిష్ట మార్కెట్‌కు తీసుకురావడానికి ముందు డిజైన్ పేటెంట్‌ దాఖలు చేయడం జరుగుతుంది.

Details

అట్లాస్ జీటీ.. లాంగ్ రైడ్‌ల కోసం

నార్టన్ అట్లాస్ జీటీ 585cc అడ్వెంచర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన రోడ్‌ ఫోకస్డ్ బైక్‌.

ఇందులో 69 bhp పవర్‌, 57.5 Nm టార్క్‌ ఇచ్చే 585cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది.

6-స్పీడ్ గేర్‌బాక్స్‌, క్విక్‌షిఫ్టర్‌, 15.4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌, 845mm సీట్ హైట్‌ వంటి అంశాలు ఉన్నాయి.

19-అంగుళాల ఫ్రంట్‌, 17-అంగుళాల రియర్ అల్లాయ్ వీల్స్‌ దీన్ని హైవే టూరింగ్‌కు అనుకూలంగా నిలబెడతాయి.

Details

మ్యాంక్స్ ఆర్.. 206 bhp పవర్‌తో

మరోవైపు నార్టన్ మ్యాంక్స్ ఆర్‌ పూర్తిగా భిన్నమైన బైక్‌. 1,200cc V4 ఇంజిన్‌తో వచ్చే ఈ సూపర్‌స్పోర్ట్ 206 bhp పవర్‌, 130 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ గేర్‌బాక్స్‌, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్‌, వీలీ, స్లైడ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్‌ ఇందులో ఉన్నాయి.

Brembo బ్రేకులు, Pirelli Diablo Supercorsa SP V4 టైర్లు దీని స్పోర్టీ స్వభావాన్ని మరింత బలపరుస్తాయి.

ADVERTISEMENT

Details

టీవీఎస్ వ్యూహంలో కీలక అడుగు

టీవీఎస్ 2020లో నార్టన్‌ను కొనుగోలు చేసిన తర్వాత బ్రాండ్‌ను తిరిగి బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం అట్లాస్‌, మ్యాంక్స్‌, మ్యాంక్స్ ఆర్‌తో పాటు 450cc రోడ్‌స్టర్‌ వంటి మోడళ్లు నార్టన్ లైనప్‌లో ఉన్నాయి.

భారత్‌లో అట్లాస్ జీటీ ముందుగా అడుగుపెడితే ప్రీమియం అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌లో పోటీ పెరగొచ్చు.

ఆ తర్వాత మ్యాంక్స్ ఆర్‌ వస్తే 200 bhpకు పైగా పవర్‌ ఉన్న సూపర్‌బైక్‌ విభాగంలో నార్టన్ పేరు మరింత బలంగా వినిపించే అవకాశం ఉంది.

ADVERTISEMENT