
Apache: ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ క్రేజ్.. 20 ఏళ్లుగా మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్ అపాచీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్ బ్రాండ్ 'టీవీఎస్ అపాచీ' 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఇప్పటివరకు 60 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.
అపాచీ అభివృద్ధి ప్రయాణం
భారతదేశంలో 2005లో టీవీఎస్ మోటార్స్ తమ తొలి పర్ఫార్మెన్స్ బైక్ 'అపాచీ 150'ని విడుదల చేసింది. స్పోర్టీ లుక్స్, అధునాతన ఫీచర్లతో ఈ బైక్ అప్పట్లోనే యువతను ఆకట్టుకుంది.
అప్పటి నుంచి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందిస్తూ, అపాచీ బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేసింది.
Details
అంతర్జాతీయ స్థాయికి ఎదుగుదల
టీవీఎస్ మోటార్స్‌కు చెందిన రేసింగ్ విభాగం ఆధారంగా అభివృద్ధి చేసిన అపాచీ, ప్రస్తుతం 60కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది.
నేపాల్, బంగ్లాదేశ్, కొలంబియా, మెక్సికో, గినియా వంటి దేశాలతో పాటు ఇటలీ, యూరప్ ప్రాంతాల్లో కూడా మార్కెట్ విస్తరించింది.
అపాచీ బ్రాండ్ ప్రత్యేకతలు
సంవత్సరాలుగా, టీవీఎస్ అపాచీ నిరంతరం కొత్త ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా
ఫ్యూయెల్ ఇంజెక్షన్, మల్టిపుల్ రైడ్ మోడ్స్
అడ్జెస్టెబుల్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్
డ్యూయెల్ ఛానల్ ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్, క్రూయిజ్ కంట్రోల్
Details
టీవీఎస్ అపాచీ ప్లాట్‌ఫామ్‌లు
అపాచీ రెండు ప్రధాన సెగ్మెంట్లలో అందుబాటులో ఉంది
1. ఆర్‌టీఆర్ సిరీస్ - స్ట్రీట్ రైడింగ్ కోసం
2. ఆర్‌ఆర్ సిరీస్ - అధిక పనితీరు, రేస్-ఫోకస్డ్ రైడింగ్ కోసం
అంతేకాకుండా, అపాచీ బ్రాండ్ బైకులను పర్సనలైజ్ చేసుకునేందుకు 'బిల్డ్-టు-ఆర్డర్' ఆప్షన్‌ను అందించిన భారతదేశపు తొలి ద్విచక్ర వాహన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.
అపాచీ రైడర్ కమ్యూనిటీ
టీవీఎస్ మోటార్స్ అపాచీ ఓనర్స్ గ్రూప్ (AOG) ద్వారా 3,00,000 మందికి పైగా రైడర్లను కలిపింది. ప్రపంచవ్యాప్తంగా రైడ్స్, ఈవెంట్లు, ట్రాక్-డే సెషన్లు నిర్వహిస్తూ, రైడింగ్ కల్చర్‌ను మరింత బలోపేతం చేస్తోంది.
Details
భవిష్యత్తు ప్రణాళికలు
టీవీఎస్ మోటార్ కంపెనీ, అపాచీ బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు పర్ఫార్మెన్స్, భద్రత, రైడర్ ఎంగేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతుందని తెలిపింది.
అపాచీ తన మూడవ దశాబ్దంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, ఈ బ్రాండ్ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని అంచనా.