తదుపరి వార్తా కథనం

Ola Electric: 4,000 స్టోర్ల నెట్‌వర్క్‌తో ఓలా ఎలక్ట్రిక్ నూతన ఆఫర్ల ప్రకటన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 25, 2024
04:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. దేశవ్యాప్తంగా కొత్తగా 3,200 స్టోర్లను ప్రారంభించింది.
దీంతో ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్య 4,000కు పెరిగిందని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.
ఈ నెట్‌వర్క్ విస్తరణపై భవీశ్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
మెట్రో, టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాలను కూడా తమ సర్వీస్ సెంటర్లలో చేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
Details
ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే
ఈ సందర్భంగా ఓలా స్కూటర్లపై అదనపు ఆఫర్లను కూడా ప్రకటించారు.
ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోలోని స్కూటర్లపై రూ. 25వేల విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
నెట్‌వర్క్ విస్తరణ సందర్భంగా ఈ ఆఫర్‌ను డిసెంబర్ 25న మాత్రమే అందుబాటులో ఉంచింది.